కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో కీలక సమావేశం..!!

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( Minister Amit Shah )నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది.

ఇందులో భాగంగా బీహార్ రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నారని తెలుస్తోంది.బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, చిరాగ్ పాశ్వాన్( JP Nadda, Chirag Paswan ) తో పాటు పలువురు కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

బీహార్ రాష్ట్రంలో జేడీయూతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ యోచిస్తోంది.ఇందులో భాగంగా మంత్రివర్గ కూర్పుతో పాటు ఇతర అంశాలపై కూడా ప్రధానంగా చర్చించనున్నారు.

అలాగే జేడీయూతో వచ్చే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రభుత్వంలో భాగస్వామ్యంపై కూడా బీజేపీ చర్చిస్తున్నట్లు సమాచారం.

స్పీకర్ తో పాటు రెండు డిప్యూటీ సీఎం పదవులను బీజేపీ ఆశిస్తోంది.ఈ క్రమంలోనే బీజేపీ ఇవాళ సాయంత్రానికి జేడీయూకి మద్ధతు లేఖ ఇవ్వనుందని సమాచారం.

‘మన హక్కు హైదరాబాద్’ అంటూ కర్టెన్ రైజర్ ప్రచార గీతం..