మావోయిస్టు నేత ఆర్కేకు ఘన నివాళి

సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ (63) అలియాస్ రామకృష్ణ, ఆర్కే, సాకేత్, మధు, శ్రీనివాస్ కు వైద్యం అందించినప్పటికీ రక్షించుకోలేకపోయమని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ స్పష్టం చేశారు.

ఆర్కె మరణాన్ని ధృవీకరిస్తూ శుక్రవారం ఓ ప్రకటన అంత్యక్రియలకు సబంధించిన ఫోటోలను శనివారం విడుదల చేశారు.

ఆర్కేకు అకస్మాత్తుగా కిడ్నీల సమస్య మొదలగు వెంటనే డయాలసిస్ ప్రారంభించినప్పటికీ కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పర్యవసానంగా ఈనెల 14న ఉదయం 6 గంటలకు అయ్యారని పేర్కొన్నారు.

ఆర్కేకు విప్లవ శ్రేణుల మధ్య అంత్యక్రియలు నిర్వహించామని ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని చెప్పారు.

సాధారణ జీవితం, అంకుఠిత దీక్ష ప్రజల పట్ల ప్రేమ కామ్రేడ్స్ తో ఆప్యాయతలు, విప్లవ గమనంపై స్పష్టతతో విప్లవోద్యమానికి నిస్వార్థంగా సేవలు అందించారని కొనియాడారు.

ఆర్కే ఆశయాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఛత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా పామేడు కొండపల్లి మధ్య అటవీ ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు పార్టీ శ్రేణులు సమక్షంలో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆర్ కే మృతదేహంపై ఎర్రజెండా నుంచి మావోయిస్టులు నివాళులర్పించారు. """/"/ ఆర్కే అంత్యక్రియల్లో బీజాపూర్, సుకుమా జిల్లాలోని పాలగూడ, గుండ్రాయి, కంచాల, మీనగట్టు, లాభాలు, తదితర గ్రామాల నుంచి సుమారు 2000 మందికి పైగా ఆదివాసుల తో పాటు పెద్ద ఎత్తున మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది ర్యాలీ నిర్వహించినట్లు సమాచారం.

ఆర్కే  మృతి విషయాన్ని ఒడిస్సా లోని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పిళ్లై వీడియో ద్వారా వెల్లడించారు.

పోలీసులకు లొంగి పోయి ఉంటే ఆర్కేకు నాణ్యమైన వైద్యం అందేదని బతికేవాడు అన్నారు.

సకాలంలో వైద్యం అందక పోవడంతో గతంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు రామన్న, హరి భూషణ్ లతో పాటు దండకారణ్యం స్పెషల్ కమిటీ సభ్యులు సైతం ప్రాణాలు విడిచారని ఐజీ గుర్తు చేశారు.

వీడియో వైరల్‌: వామ్మో.. ఇదేం నాగిని డాన్స్ స్వామి..