కేసీఆర్ పై ఢిల్లీ నుంచి భారీ స్కెచ్.. ఉప ఎన్నిక తర్వాత షురూ..?
TeluguStop.com
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై యుద్దం చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు కూడా ఈ విషయంపై ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెక్ పెట్టేందుకు తెలంగాణలో భారీ ఆపరేషన్ కి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ దిశగా కేంద్రం వ్యూహాత్మక అడుగులు వేస్తోందా.? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పండితులు.
ఇప్పటి వరకు కేంద్రంపై నిప్పులు చెరుగుతున్న సీఎం కేసీఆర్ ను నిలువరించేందుకు మునుగోడు ఉప ఎన్నిక తర్వాత.
ముహూర్తం ఫిక్స్ చేశారని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.గత కొన్నాళ్లుగా సీఎం కేసీఆర్ కేంద్రంపై మండిపడుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేసి తీవ్రంగా విమర్శస్తున్నారు.తీవ్రస్థాయిలో దూషిస్తున్నారు.
అయితే వీటిపై ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు స్పందించలేదు.దీంతో కేసీఆర్ మరింత దూకుడుగా ముందుకు సాగుతున్నారు.
H3 Class=subheader-styleదూకుడుకు చెక్ పెట్టేందుకు./h3p
ఈ క్రమంలో రాష్ట్రంలోని నేతలు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్న విషయం తెలిసిందే.
ఏదో ఒకటి చేసి.కేసీఆర్ ను నిలువరించాలని కోరుతున్నారు.
తెలంగాణ నాయకులు.దీనికి తోడు కేంద్రం కూడా కేసీఆర్ వైఖరిపై గుర్రుగానే ఉంది.
రైతుల ధాన్యం కొనుగోలు సహా.మూడో ఫ్రంట్ ఏర్పాటు.
మోడీ వ్యతిరేక శక్తులను ఏకం చేయడం వంటి పరిణామాలను కేంద్రంలోని పెద్దలు గమనిస్తూ వచ్చారు.
ఈ క్రమంలోనే అదును చూసుకుని విరుచుకుపడేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు.అయితే కేసీఆర్ బంధువు ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడిగా ఉన్న నేతను టార్గెట్ చేసుకుని ఈడీ దాడులు జరిగే అవకాశం లేకపోలేదని.
తద్వారా గట్టి సంకేతాలు పంపించి కేసీఆర్ ను సైలెంట్ చేసేలా వ్యూహాన్ని అమలు చేయనున్నట్లు చెబుతున్నారు.
"""/" /
H3 Class=subheader-styleబెంగాల్ లో కూడా ఇలానే./h3p
ఇప్పటికే కేంద్రంపై విరుచుకుపడిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కేంద్రం నిలువరించగలిగింది.
ఆ రాష్ట్ర మంత్రి పార్థా చటర్జీపై కేసు నమోదు చేయడంతోపాటు.ఇతర నేతలను కూడా దీనిలో ఇరికించిందనే విమర్శలు ఉన్నాయి.
దీంతో అప్పటి వరకు నిప్పులు చెరిగిన మమత మోడీతో మైత్రికి రెడీ అయ్యారు.
మోడీ అమిత్ షాల మొహం చూడడని చెప్పిన మమత నేరుగా ఢిల్లీకి వెళ్లి మోడీతో భేటీ కావడం గమనార్హం.
ఇలానే తెలంగాణలోనూ ఆపరేషన్ జరగడం ఖాయమని అంటున్నారు.ఎన్నికల సమయానికి కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేసి తెలంగాణలో బలం పెంచుకోవాలని చూస్తున్నారట.
మరి మునుగోడు ఉప ఎన్నిక తర్వాత జరిగే పరిణామాలేంటో.దానికి కేసీఆర్ ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.
బస్సులో నిద్రిస్తున్న మహిళను వేధించిన కండక్టర్.. వీడు కండక్టర్ కాదు, కామాంధుడు.. వీడియో వైరల్