పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‎ఖాన్ కు భారీ ఊరట

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను భారీ ఊరట లభించింది.తోషఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ కు ఇస్లామాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఇమ్రాన్ ఖాన్ విజ్ఞప్తిని పరిశీలించిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

కాగా ఈనెల 5వ తేదీన తోషఖానా బహుమతుల దుర్వినియోగం కేసులో ఇమ్రాన్ ఖాన్ ను ఇస్లామాబాద్ కోర్టు దోషిగా తేల్చింది.

ఈ క్రమంలోనే లాహోర్ లో ఆయనను పాకిస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు.అప్పటి నుంచి జైలులోనే ఉన్న ఇమ్రాన్ ఖాన్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ప్రియుడి సర్‌ప్రైజ్ ప్లాన్ రివర్స్.. కేక్‌లో రింగ్ పెడితే ఇలాగే ఉంటది మరి!