హైదరాబాద్ లో గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతొ భారీ మోసం

హైదరాబాద్: జూన్ 23 గోల్డ్ ట్రేడింగ్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో హైదరాబాద్ లో భారీ మోసం వెలుగు చూసింది.

అధిక లాభాలు ఆశ చూపి 500 మంది వరకు ప్రహణేశ్వరి ట్రేడర్స్ ఎండీ రాజేష్ అనే వ్యక్తి మోసం చేసినట్లు తెలిసింది,దీంతో తమకు న్యాయం చేయాల ని, బాధితులంతా ఆదివారం సీసీఎస్ ముందు ఆందోళ నకు దిగారు.

పెట్టిన సొమ్ముకు ఐదునెల్లో రెట్టింపు ఇస్తానని రాజేష్ బాధికులకు నమ్మబలికాడు.తొలుత లాభాలు ఇవ్వగా ఇదంతా నిజమే అని నమ్మి మరింత మంది ఈ స్కీమ్ లో చేరారు.

అలా ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేసిన రాజేశ్.

ఆ తర్వాత పరారయ్యాడు.దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు న్యాయం కోసం పోలీసు లను ఆశ్రయించారు.

కల్కి బ్లాక్ బస్టర్ హిట్టైనా ఆమెకు మాత్రం లాభం లేదా.. ఆ పాత్రకు ఎవరైనా ఒకటే అంటూ?