సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో భారీ అగ్నిప్రమాదం

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని టెక్స్ టైల్ పార్క్ లో అగ్నిప్రమాదం సంభవించింది.

ప్రభుత్వ గిడ్డంగుల సముదాయంలోని గోదాంలో మంటలు చెలరేగాయి.మంటలు భారీగా ఎగసి పడుతున్నాయి.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాగా గోదాంలోని గన్నీ సంచులన్నీ పూర్తిగా దగ్ధం అయ్యాయి.ఈ ప్రమాదం కారణంగా సుమారు రూ.

కోటి వరకు నష్టం వాటిల్లవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.