ఛత్తీస్గఢ్లో భారీ పేలుడు.. 17 మంది మృతి
TeluguStop.com
ఛత్తీస్గఢ్లో భారీ పేలుడు సంభవించింది.బెమెతరా జిల్లాలోని(Bemetara District) ఓ గన్ పౌడర్ తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగిందని తెలుస్తోంది.
ఈ ఘటనలో 17 మంది మృతిచెందగా.పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు (police)ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.అలాగే ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.బ్లాస్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వీడియో: నెటిజన్లను నవ్విస్తున్న ఎలాన్ మస్క్ రోబో.. తడబడుతూనే నడక నేర్చుకుంటోందిగా..?