వీడియో: ఈ పాము మామూలుది కాదు.. హిప్నటైజ్ చేసి అటాక్‌ చేస్తుంది!

సోషల్ మీడియాలో లెక్కలేనన్ని వన్యప్రాణుల వీడియోలు వైరల్ అవుతుంటాయి.వాటిలో కొన్నిటిని చూస్తే మనం ఆశ్చర్యపోక తప్పదు.

తాజాగా అలాంటి ఒక వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఒక పాము అద్భుతంగా తన బాడీని తిప్పుతూ హిప్నటైజ్ చేస్తోంది.

ఇది తాను వేటాడే జంతువులను దగ్గరికి రప్పించి వాటిని కాసేపు ఇలా హిప్నటైజ్ చేసి ఆపై చంపేస్తుందట.

దీన్ని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.మనుషులు చేయగలిగే ప్రతి పనిని ఏదో ఒక జీవి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందనే నిజాన్ని ఒప్పుకుంటున్నారు.

@Alianabayram అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ "ఒక హాగ్ నోస్ స్నేక్ మెస్మరైజింగ్‌గా డిఫెన్సివ్ డిస్‌ప్లే చేస్తోంది" అని ఒక క్యాప్షన్ జోడించారు.

ఈ వీడియోలో ఒక మనిషి చేతిలో ఉన్న పాము తన తలను కదిలించకుండా ఉంచింది.

కానీ మచ్చలు మచ్చలు ఉన్న తన ఇతర శరీరాన్ని మాత్రం తిప్పేస్తూ హిప్నటైజ్ చేసింది.

దాని శరీరంపై డిజైన్ చూస్తూ ఉండగా అది హఠాత్తుగా ఊహించని రీతిలో తన నోరు తెరిచి దాడి చేసింది.

"""/"/ 7-సెకన్ల నిడివి గల ఈ వీడియో చూసి చాలామంది వామ్మో పాము ఇలా కూడా ప్రవర్తిస్తాయా అని కామెంట్లు చేస్తున్నారు.

కొన్ని సినిమాల్లో పాములను హిప్నటైజ్ చేసి కొంతమందిపై పురిగొల్పవచ్చని చూపించారు.కానీ శాస్త్రీయంగా ఇది సాధ్యమవుతుందని ఎలాంటి ఆధారాలు లేవు.

ఇకపోతే షేర్ చేసిన సమయం నుంచి ఈ వీడియోకు 22 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఈ అద్భుతమైన వీడియోని మీరు కూడా తిలకించండి.

పాజిటివిటీ గోరంత నెగిటివిటీ కొండంత.. బన్నీకి బ్యాడ్ టైమ్ నడుస్తోందిగా!