రహదారిపై ఆవుల మంద…యజమానులపై కేసు నమోదు…!

నల్లగొండ జిల్లా: అద్దంకి-నార్కేట్ పల్లి జాతీయ రహదారిపై ఆవుల మందను తోలుకపోతున్న యజమానులపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన శనివారం నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో జరిగింది.

మండలంలోని కొత్తగూడెం సమీపంలో అద్దంకి- నార్కెట్ పల్లి రహదారిపై సుమారు 600 ఆవులను తోలుకు వెళుతుండడంతో ప్రయాణికులకు, వాహనాదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ట్రాఫిక్ కు తీవ్ర ఆటంకం కలుగుతుందని అందుకే ఆవుల మంద తోలుకు వెళుతున్న యజమానులు కేతావత్ నరసింహ, రామావత్ శ్రీను,నేతల అంజయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు.

వైరల్ వీడియో: అట్లుంటది మరి మనతోని.. ఉచిత బస్సును మాములుగా వాడట్లేదుగా..