పోటోగ్రాఫర్ కుటుంబానికి గ్రామ పెద్దల చేయూత

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ మిర్యాల రామకృష్ణ (38) చేనేత కుటుంబమైనప్పటికీ ఫోటోగ్రఫీ చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

ఆయనకు భార్య సుచరిత,కుమారుడు, కూతురు,అమ్మ ఉన్నారు.పది రోజుల క్రితం రామకృష్ణ అకస్మికంగా మృతి చెందారు.

పేద కుటుంబానికి చెందిన రామకృష్ణకు బంధుమిత్రులు, సహావృత్తిదారులు, పద్మశాలీలు, చిన్ననాటి స్నేహితులు, సహవిద్యార్థులు,గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకులు, సోషల్ మీడియాలోని వాట్సప్, ఫేస్బుక్ ఇతర గ్రూపుల మానవత వాదుల ద్వారా సమకూరిన పది లక్షల రూపాయలను శనివారం రామకృష్ణ దశదినకర్మ సందర్భంగా మాజీ జడ్పిటిసి పున్న లక్ష్మీజగన్మోహన్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, మాజీ సర్పంచులు అప్పం లక్ష్మీనర్సు, రాపోలు నిర్మల నరసింహ, మాజీ ఎంపీటీసీలు బడుగు రమేష్,చేనేత సహకార సంఘం మాజీ అధ్యక్షుడు అప్పం రామేశ్వరం గ్రామానికి చెందిన వివిధ కుల సంఘాల నాయకులు అందరూ కలిసి రామకృష్ణ కుటుంబ సభ్యులకు చెక్కులను అందజేశారు.

అంతకుముందు రామకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.కుటుంబ సభ్యులను ఓదార్చారి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు గోశిక చక్రపాణి, సిరిగిరెడ్డి నర్సిరెడ్డి, ధనుంజయ,అప్పం గోయల్, సాయిని శేఖర్,దాసిరెడ్డి శ్రవణ్ కుమార్ రెడ్డి,పున్న వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

వివేక్ రామస్వామి పదవిపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన