సూర్యాపేట జిల్లా:శారీరక శ్రమ ప్రాధాన్యత తగ్గిన తరుణంలో ప్రతి ఒక్కరూ యోగా( Yoga )ను రోజువారీ జీవితంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్య వంతమైన సమాజం సాధ్యం అవుతుందని సూర్యాపేట జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కోటాచలం అన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం( International Day Of Yoga ) పురస్కరించుకొని కేంద్ర సమాచార,ప్రసార మంత్రత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్యర్యంలో బుధవారం సూర్యాపేట( Suryapet ) తెలంగాణ గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా క్షేత్ర ప్రచార అధికారి కోటేశ్వర్ రావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య,ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కోటా చలం ముఖ్య అతిధిగా,కళాశాల ప్రిన్సిపాల్ సునీల్,యోగా గురువు రాధిక అతిధులుగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సమాజంతోనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.
ఆహారం, పర్యావరణం కలుషితం అవుతున్న తరుణంలో యోగా సాధన చాలా ముఖ్యంగా మారిందని అన్నారు.
గిరిజన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సునీల్ మాట్లాడుతూ ప్రపంచానికి యోగా లాంటి అద్భుత వ్యాయామ విద్యను ప్రపంచానికి అందించిన ఘనత భారతదేశానికే దక్కుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా యోగా గురువు రాధిక విద్యార్థులుతో యోగాసనాలు,సూర్య నమస్కారాలు సాధన చేయించారు.
విద్యార్థులకు యోగా ఫర్ హెల్త్ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు,కళాశాల ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
జాక్ మూవీ ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్.. సిద్ధు జొన్నలగడ్డ ఖాతాలో బ్లాక్ బస్టర్ పక్కా!