ట్రాఫిక్ రూల్స్ పాటించలేదని ప్రిన్సిపాల్ ని కొట్టిన పోలీస్..!

కొందరు పోలీసులు హద్దులు మీరి ప్రవర్తిస్తారు.ఒంటిపై యూనిఫాం వేసుకోగానే వారిని ఎవరూ ఎదురించలేరు అనుకుంటారేమే.

సామాన్యులపై వారి ప్రతాపం చూపిస్తారు.ఎవరినీ కొట్టే అధికారం పోలీసులకు లేదు అని వారికి తెలిసినా.

అవేవీ పట్టించుకోరు.తమదే పెత్తనం అన్నట్లుగా ఇష్టారీతిగా ప్రవర్తిస్తుంటారు.

అమాయకులు, సామాన్యులపై చేయి చేసుకుంటారు.ఇప్పుడు కర్నూలు జిల్లా పత్తికొండ అర్బన్ పోలీసు స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రవర్తించిన తీరు ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది.

నిన్న సాయంత్రం ఆదోని రోడ్డులో ఓ వ్యక్తిపై దుర్భాషలాడుతూ, కొడుతూ విచక్షణ రహితంగా ప్రవర్తించాడు.

వాహనదారులు నిబంధనలు పాటించకపోతే ఫైన్ వేయాల్సింది పోయి.దుర్భాషలాడుతూ కొట్టడం అక్కడే ఉన్న వారందరినీ ఆశ్చర్యపరిచింది.

టూ వీలర్ పై ఓ వ్యక్తి వస్తుండగా.ఆదోని రోడ్డు పుష్ప ఆస్పత్రి సమీపంలోకి రాగానే హెడ్ కానిస్టేబుల్ జయన్న అతడిని ఆపారు.

వాహనాన్ని ఆపగానే.ఆ వ్యక్తిపై హెడ్ కానిస్టేబుల్ జయన్న తిట్ల దండకం అందుకున్నాడు.

దుర్భాషలాడుతూ ఇష్టమొచ్చినట్లుగా కొట్టాడు.పిడిగుద్దులు గుద్దారు.

కాలితో తన్నారు.ఆ వ్యక్తి నుండి సెల్ ఫోన్, టూ వీలర్ లాక్కొని స్టేషన్ కు తీసుకెళ్లాడు ఆ హెడ్ కానిస్టేబుల్ జయన్న.

సామాన్యులు కొట్టుకుంటే స్థానికులు ఆపేందుకు ప్రయత్నిస్తారు.కానీ ఇక్కడ ఓ సామాన్యుడిని కొట్టేది పోలీసు యూనిఫాం వేసుకున్న హెడ్ కానిస్టేబుల్ జయన్న.

విచక్షణ మర్చిపోయి సామాన్యుడిపై దాడి చేసిన ఆ వ్యక్తిని ఆపేందుకు ప్రయత్నిస్తే తమపై ఎక్కడ దాడి చేస్తాడోనన్న భయంతో ఎవరూ అతడిని ఆపే ప్రయత్నం చేయలేదు.

Bets 10 Bonuses And Promotions: A Practical Welcome Bonus Breakdown