కాంగ్రెస్ లో పెరుగుతున్న అసంతృప్తుల జాబితా

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తుల సంఖ్య పెరుగుతోంది.అభ్యర్థులు రెండు జాబితాలు ప్రకటించిన తరువాత వీరి సంఖ్య మరింత పెరిగిందని తెలుస్తోంది.

అభ్యర్థుల రెండో జాబితాలో పలు నియోజకవర్గాల నుంచి టికెట్లు ఆశించి నేతలు భంగపడ్డారు.

జడ్చర్ల లేదా నారాయణపేట్ టికెట్ ఆశించి ఎర్ర శేఖర్ భంగపడగా వనపర్తి టికెట్ ఆశించిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డి పార్టీపై తీవ్ర అసహనంతో ఉన్నారు.

అలాగే నర్సాపూర్ టికెట్ ఆశించిన గాలి అనిల్, ఎల్లారెడ్డి టికెట్ ఆశించిన సుభాష్ రెడ్డి, హుజురాబాద్ నుంచి బల్మూరి వెంకట్, హుస్నాబాద్ నుంచి ప్రవీణ్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, బెల్లయ్య నాయక్ టికెట్ ఆశించారు.

అదేవిధంగా పాలకుర్తి టికెట్ నుంచి తిరుపతి రెడ్డి, జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి, మహేశ్వరం నుంచి పారిజాత నర్సింహారెడ్డి, అంబర్ పేట్ నుంచి నూతి శ్రీకాంత్, మోతె రోహిత్, దేవరకొండ నుంచి రమేశ్ నాయక్ లు టికెట్లు ఆశించగా దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అయితే వీరంతా కార్యకర్తలు, అనుచరులతో సమావేశాలు నిర్వహించనున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే కొందరు నేతలు ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచనలో ఉండగా మరికొందరు వేరే పార్టీలో చేరాలనే యోచనలో ఉన్నారని సమాచారం.

సాయి ధరమ్ తేజ్ పరిస్థితి ఏంటి..? ఆయన ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నాడు…