అక్కడ వాహనాలు నడిచేందుకు ఇంధనంతో పనిలేదు..మనదేశంలోనే ఉన్న ఆ ప్రాంతం గురించి తెలుసా?

మనదేశంలో పలు రహస్యమయ ప్రదేశాలు ఉన్నాయి.వాటిలో ఒక రహస్య ప్రదేశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇక్కడ పెట్రోల్-డీజిల్ అవసరం లేకుండా వాహనాలు నడుస్తాయి.అది లడఖ్‌లోని లేహ్ ప్రాంతంలో ఉంది.

ఇక్కడి రోడ్డుపై కారు దానంతటదే ముందుకు కదులుతుంది.అంతేకాదు ఎవరైనా వారి కారును ఈ ప్రాంతంలో పార్క్ చేస్తే, ఇక ఆ కారు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.

దీని వెనుకనున్న మిస్టరీ ఈనాటికీ వీడలేదు.శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఈ పర్వత ప్రాంతంలో ఒక అయస్కాంత శక్తి ఉంది.

ఇది గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వాహనాలను తన వైపునకు లాగుతుంది.అందుకే దీనిని అయస్కాంత కొండ అని అంటారు.

ఈ కొండపై అయస్కాంత ప్రభావం ఎంతగా ఉందంటే.పైభాగంలో ఎగురుతున్న విమానాలపై కూడా ప్రభావం పడుతున్నదని తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ఇక్కడి నుంచి టేకాఫ్ అవుతున్నప్పుడు విమానాల్లో ప్రకంపనలు వచ్చినట్లు పలువురు పైలట్లు పేర్కొన్నారు.

ఈ అయస్కాంత కొండను గ్రావిటీ హిల్ అని కూడా అంటారు.ఈ కొండపై లా ఆఫ్ గ్రావిటీ ఫెయిల్ అవుతుందని చెబుతారు.

గురుత్వాకర్షణ నియమం ప్రకారం.మనం ఒక వస్తువును వాలుగా వున్న ప్రదేశంపై నుంచి వదిలివేస్తే, అది కిందకి దొర్లుతుంది.

అయితే అయస్కాంత కొండపై దీనికి విరుద్ధంగా జరుగుతుంది.మరి ఈ మిస్టరీ ఎన్నడు వీడుతుందో చూడాలి.

అమెరికా : స్కూళ్లలోకి టీచర్లు హ్యాండ్‌ గన్ తీసుకెళ్లేలా .. కీలక బిల్లుకు టెన్నెస్సీ ఆమోదం