బండి అక్రమ అరెస్టుకు నిరసనగా ఎల్లారెడ్డిపేటలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

రాజన్న సిరిసిల్ల జిల్లా: కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్టుకు నిరసనగా ఎల్లారెడ్డిపేట బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ అర్ధరాత్రి బండి సంజయ్ ని ప్రభుత్వ వ్యతిరేక విధానాల పైన పోరాడుతున్న ప్రభుత్వ అక్రమాలపై అవినీతిపై పేపర్ లీకేజీ విషయాన్ని తన అసమర్ధతను ప్రభుత్వం కప్పిపుచ్చేందుకు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తున్నందుకు భాజాప రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ని అరెస్టు చేయడం భారతీయ జనతా పార్టీ మండల శాఖ తీవ్రంగా ఖండిస్తుందని హెచ్చరించారు.

"""/" / తెలంగాణ నిరుద్యోగుల విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న కల్వకుంట్ల కుటుంబం అని,తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు, యువకులు నిరుద్యోగులు, విద్యార్థులు కలిసి తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దె దించుతారనీ హెచ్చరించారు.

ఎల్లారెడ్డిపేట బిజెపి నాయకులు H3 Class=subheader-styleరేపాక రామచంద్ర రెడ్డి, బొమ్మడి స్వామి, జితేందర్ రెడ్డి, /h3pకృష్ణ హరి, దేవయ్య లను అరెస్టు చేయడం అన్యాయమని అన్నారు.

తక్షణమే అరెస్టు చేసిన వారిని వెంటనే విడిచిపెట్టాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు దాసరి గణేష్, బోనాల సాయికుమార్, బోడావత్ రవి నాయక్, ధరావత్ రవి నాయక్, కమ్మరి ఆంజనేయులు, రమేష్, తదితరులు నాయకులు పాల్గొన్నారు.

ఆన్లైన్లో విషం తెప్పించుకొని సూసైడ్ చేసుకున్న హైదరాబాద్ టెక్కి..