కోతులు స్వైర విహారం పట్టించికోని పాలక మండలి

నల్లగొండ జిల్లా: పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రంలో కోతుల బెడద అధికంగా ఉండడంతో గ్రామ ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.

దీనిపై గ్రామ పంచాయతీ పాలక మండలి పట్టించుకునే స్థితిలో లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కోతుల బెడద నుండి ప్రజలను కాపాడాలని ఎన్నిసార్లు సర్పంచ్,సెక్రెటరీ, అధికారుల దృష్టికి తీసుకపోయినా ఫలితం లేదని వాపోతున్నారు.

కోతులు ఇళ్లల్లోకి దూరి వస్తువులను ఎత్తుకెలుతూ ఇంటిలో ఉన్న వాళ్లపై దాడి చేస్తున్నాయని, ఇండ్లలో ఉండాలంటే పిల్లలు,వృద్దులు వణికి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మండల కేంద్రానికి వందల సంఖ్యలో వచ్చిపోయే వారిపై కూడా దాడి చేస్తున్నాయని,వెంటనే ఉన్నతాధికారులు స్పందించి కోతుల బెడద నుంచి గ్రామ ప్రజలను కాపాడాలని కోరుతున్నారు.

అప్పుడు టీడీపీలో ఇప్పుడు వైసీపీలో … వణికిపోతున్నారే ?