అబ్బాయిలను మించిపోయిన అమ్మాయి.. రన్నింగ్ బస్సులోకి ఎక్కిందిలా!

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.అలా వైరల్ అవుతున్న వీడియోలో కొన్ని ఆశ్చర్యంగా ఉంటే, మరికొన్ని విడ్డురంగా అనిపిస్తుంటాయి.

ముఖ్యంగా కాలేజీ కుర్రాళ్లకు సంబందించిన వీడియోలు అయితే ఒకింత ఫన్నీగా అనిపిస్తుంటాయి.తాజా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రోజురోజుకీ మారిపోతున్న దైనందిత జీవితంలో పట్టణాల్లో ట్రాఫిక్ ఏ విధంగా వుందో చెప్పాల్సిన పనిలేదు.

కాలేజీకి వెళ్లే సమయంలో బస్సులతో వారు చేసే ఫీట్లు అన్నీ ఇన్నీ కావు.

ఈ క్రమంలో బస్సులకు వేలాడుతూ పయనించడం, రన్నింగ్ బస్ ఎక్కడం, ఫుట్ బోర్డు మీద ప్రమాదకరంగా నిలబడటం.

వంటి చర్యలకు పాల్పడుతూ వుంటారు.అది చాలా రిస్క్ అని తెలిసినా వాళ్లు భయపడరు.

కాలేజీకి లేట్ అయిపోతుందేమో అని కొందరు, అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలని కొందరు ఇలా ఎవరికి నచ్చినట్టు వారు ప్రవర్తిస్తూ వుంటారు.

అయితే అబ్బాయిలు అలా చేయడంలో వింతేమీ లేదు.కానీ, అమ్మాయిలు ఎవరైనా ఇలాంటి ఫీట్లు చేయడం ఎప్పుడైనా చూశారా? చూసుండరు కదూ.

కానీ, ఓ అమ్మాయి అలాంటి చర్యలకు పాల్పడింది.దాంతో నెటిజన్లు సదరు వీడియోని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.

అవును, హర్యానాకు చెందిన ఓ అమ్మాయి రన్నింగ్ బస్ లోకి కిటికీలోంచి ఎక్కి అందరినీ విస్మయానికి గురి చేసింది.

అబ్బాయిలకు సైతం సాధ్యం కాని ఫీట్ ఇది అని నెటిజన్లు ఆమెని ఆకాశానికెత్తేస్తున్నారు.

కొంతమంది అమ్మాయికి అంత సాహసం తగదని అనగా, మరికొంతమంది అబ్బాయిలేనా అమ్మాయిలుకూడా ఇలాంటివి చేయగలరు అని సపోర్ట్ చేయడం విశేషం.

ఇంకొంతమంది మాత్రం దయచేసి విద్యార్థులెవరూ ఇలాంటి ప్రాణాంతక స్టంట్స్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఎట్టకేలకు హీరో విక్రమ్‌కి టాలెంటెడ్ డైరెక్టర్ దొరికాడు.. ఇక మంచి రోజులు వచ్చేశాయి