కెమెరాకి చిక్కిన దెయ్యం పక్షి.. దీన్ని చూస్తే హడలిపోతారు అంతే!

మనకు తెలియని పక్షులు ఈ భూ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి.వీటిలో కొన్ని అత్యంత అందమైన అయితే మరి కొన్ని అత్యంత అందవిహీనంగా ఉండేది పెడుతుంటాయి.

కొన్ని పక్షులు రాక్షసుల్లాగా, భూతాలు, దెయ్యాల వలె కనిపిస్తాయి.అయితే అచ్చం దెయ్యం లాగా కనిపించే ఒక పక్షి ఉంది దానికి 'ఘోస్ట్ బర్డ్' అనే పేరు ఉంది.

గుడ్లగూబలా కనిపించే ఈ రాత్రిపూట పక్షి హరిస్తే అచ్చం ఒక ఘోస్ట్ అరిచినట్లే ఉంటుంది.

గుడ్లగూబలా కనిపించినా ఇది ఆ కుటుంబానికి చెందినది కాదు.వైరల్ అవుతున్న వీడియోలో ఒక వికృతమైన రూపంలో ఒక పక్షి ఉండటం చూడవచ్చు.

ఈ పక్షి సౌత్ అమెరికాలో కనిపించే ఘోస్ట్ బర్డ్ వీడియో లో రాశారు.

ఆ పక్షి ప్రతి నాలుగేళ్లకోసారి నోరు తెరిస్తే చాలా భయంకరంగా కనిపిస్తోంది.ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసిన పూబిటీ షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే 3 లక్షల వరకు లైకులు వచ్చాయి.

మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి.మొదటగా దీనిని వైరల్ హాగ్ ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.

కాగా దీన్ని మళ్లీ పూబిటీ షేర్ చేయగా ఇప్పుడు అది వైరల్ గా మారింది.

"ఈ దెయ్యం పక్షి క్యూట్‌గా ఉంది కానీ చిన్న పిల్లలు దీన్ని చూస్తే తప్పక భయపడతార"ని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

హ్యారీ పోటర్ మూవీలో ఉన్న పక్షి లాగానే ఉంది అని ఇంకొకరు కామెంట్ పెట్టారు.

"వామ్మో దీన్ని దగ్గర నుంచి చూస్తే ఎవరైనా సరే హడలి పోతారు" అని ఇంకొక ఇంటర్నెట్ యూజర్ వ్యాఖ్యానించారు.

ఓరి నాయనో, ఇది అందర్నీ ఒకేసారి మింగేలాగా నోరు తెరుస్తుందేంటి అని మరో యూజర్ భయాన్ని వ్యక్తం చేశారు.

ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.