వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్.

సుమారు 12 లక్షల విలువ గల 20.5 తులాల బంగారు ఆభరణాలు.

43 తులాల వెండి అబరణాలు,రెండు ద్విచక్ర వాహనాలు, దొంగతనం చేయుటకు వాడే పరికరాలు ఐరన్ రాడ్, కట్టర్ , స్క్రూ డ్రైవర్ స్వాధీనం.

మీడియా సమావేశంలో వివరాల వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( Akhil Mahajan ) రాజన్న సిరిసిల్ల జిల్లా : వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.

మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఎస్పీ అఖిల్ మహాజన్.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి మండలం రామారావుపల్లి గ్రామనికి చెందిన రామటంకి సారయ్య@ వెంకటేష్ అనే వ్యక్తి జల్సాలకు అలవాటు పడి గత సుమారుగా 10 సంవత్సరాలుగా దొంగతనాలు చేస్తూ జైలు శిక్ష అనుభవించాడు.

అంతే కాక 2012 సంవత్సరం నుండి 2016 సంవత్సరం వరకు బసంతనగర్ ,కొనరావుపేట ,తంగళ్ళపల్లి, చిగురుమామిడి, చొప్పదండి, రామడుగు, మానకొండూరు లో పలు దొంగతనాలు చేయగా 2017 వ సంవత్సరంలో పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపడం జరిగింది.

2019 సంవత్సరంలో జైలు నుండి బయటకు వచ్చి జమ్మూ కాశ్మీర్( Jammu And Kashmir ) వెళ్లి ఆ తర్వాత కరీంనగర్ వచ్చి కోళ్ల ఫారం కోళ్ల దొంగతనాలు చేయగా అరెస్టు చేసి పిడి యాక్ట్ పెట్టి పది నెలలపాటు జైల్లో ఉండి 2022 సంవత్సరంలో జైలు నుండి బయటకు వచ్చాడు.

తరువాత జగిత్యాల జిలాల్లో కిరాయి రూమ్ లో ఉంటూ హెల్మెట్లు, అద్దాలు, రెక్సీన్ పని చేసుకుంటూ ఉన్నాడు.

అయితే అతను చేసే పని సంపాదన తన జల్సాలకు సరిపోక తన గ్రామస్తుడు అయిన భూతం రాములు దగ్గరికి వెళ్లి దొంగతనాలు చేసి వచ్చిన డబ్బుతో జల్సాలు చేద్దాం అని నిర్ణయించుకున్నారూ.

వారు నిర్ణయించుకున్న ప్రకారము తేదీ 27-09-2023 రోజున ఇద్దరు కలసి బస్సులో మెట్పల్లి వెళ్లి అక్కడ ఏదైనా దొంగతనం చేద్దాం అవకాశం కోసం చూస్తుండగా మెట్పల్లి గ్రామంలో ఒక మోటార్ సైకిల్ కనబడగా అట్టి మోటార్ సైకిల్ దొంగతనం చేసి వారు ఉంటున్న రూమ్ వద్దకు తీసుకోవచ్చి తేదీ 28.

8.2023 దొంగతనం చేసిన మోటార్ సైకిల్ పై దొంగతనం చేయుటకు కొండగట్టు వైపు నుండి సిరిసిల్లకు వచ్చి అక్కడ నుండి ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట ,కిష్ట నాయక్ తండ లో,తేదీ 14.

9 .2023 రోజున చందుర్తి మండలం లో గోస్కులపల్లి గ్రామంలో, తేదీ 23.

9.2023 రోజున మల్యాల గ్రామంలో అదే రోజున జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో తేదీ 5.

10.2023 రోజున కమలాపూర్ మండలం కన్నూరు గ్రామంలో, పెద్దపెల్లి జిల్లా( Peddapalli ) 8 ఇంక్లైన్ కాలనీ, పోతన కాలనీ నందు జరిగిన దొంగతనాలతో పాటుగా పలు దొంగతనాలకు పాల్పడటం జరిగింది.

ముడపెళ్లి గ్రామానికి చెందిన హన్మండ్లు,మాల్యాల గ్రామానికి చెందిన రాజయ్య లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సి.

ఐ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి దర్యాప్తు లో భాగంగా 16.

10.2023 రోజున ఉదయం అందజ 06 గంటల సమయంలో చందుర్తి సిఐ కిరణ్ కుమార్ కి వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు నిందితులు వేములవాడ లోని నంది కమాన్ వద్ద సంచరిస్తున్నారు అని సమాచారం మీద చందుర్తి ఎస్సై అశోక్ వారి సిబ్బంది చాకచక్యంగా నిందితులను పట్టుకొని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 20 .

5తులాలు బంగారు ఆభరణాలు,వెండి 43 తులాలు ద్విచక్ర వాహనాలు టీవీఎస్ స్పోర్ట్స్ నెం ఏపీ 15ఎ ఎన్ 0750 , హీరో గ్లామర్ టి ఎస్ 03 ఈ పి 4281 లను దొంగతనం చేయుటకు వాడే పరికరాలు ఐరన్ రాడ్, కట్టర్ , స్క్రూ డ్రైవర్ లు స్వాధీనం చేసుకొని విచారించగా నిందితులు తాము చేసిన దొంగతనాలు ఒప్పుకొనగా రిమాండ్ కి తరలించడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

రామటంకి సారయ్య @వెంకటేష్ గతంలో మానకొండూర్ ,ఎన్టిపిసి లక్షెట్టిపేట,బోయినపల్లి , రామగుండం, హాజీపూర్, దండేపల్లి ,ఎన్ టి పి సి, వెలగటూర్ రామడుగు , జమ్మికుంట ,గొల్లపల్లి , చొప్పదండి ,జగిత్యాల రూరల్ పరిధిలో మొత్తం 29 దొంగతనాల కేసులు ఉన్నాయన్నారు.

అలాగే రెండుసార్లు పిడి యాక్ట్ ప్రకారం జైలు శిక్ష అనుభవించాడు.దొంగలను పట్టుకొనుటలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన డిఎస్పీ నాగేంద్రచారి,చందుర్తి సిఐ కిరణ్ కుమార్,చందుర్తి ఎస్ఐ సిరిసిల్ల అశోక్, కానిస్టేబుల్స్ సతీష్ ప్రమోద్ , చందుర్తి ఎస్ఐసిరిసిల్ల అశోక్ చందుర్తి సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు.

ఈ సందర్భంగా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.గ్రామాల్లో పట్టణలాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనపడితే పోలీస్ వారికి సమాచారం అందించాలని, గుర్తు తెలియని వ్యక్తులకు రూమ్ లు అద్దెకు ఇచ్చే సమయంలో వారి యెక్క పూర్తి సమాచారం తెలుసుకోన్నా తరువాతే వారికి రూమ్ లు అద్దెకు ఇవ్వాలని,నేర నియంత్రణలో సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర వహిస్తాయని ప్రతి ఒక్కరు విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.

ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి,సి.ఐ కిరణ్ కుమార్, ఎస్.

ఐ అశోక్ , సిబ్బంది పాల్గొన్నారు.

పసిఫిక్ కింద దాగిన అద్భుతమైన మెగాస్ట్రక్చర్.. దాన్ని చూసి శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం..