విడ్డూరం : గంటల పాటు కారు డ్రైవ్‌ చేసిన కుక్క

జంతువులకు ట్రైనింగ్‌ ఇస్తే అవి కూడా మనుషులు చేసే చాలా పనులు చేయగలవు.

జంతువుల్లో కోతులు ఎక్కువగా మనుషులు చేసే పనులు చేయగలవు అంటూ ఒక అధ్యయనంలో వెళ్లడయ్యింది.

ఆ తర్వాత స్థానంలో కుక్కకు ఉంటుంది.కుక్క చాలా విశ్వాసంగా ఉంటుందనే విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే.

ఆ కుక్కలు విశ్వాసంను ప్రదర్శించేందుకు యజమాని చెప్పే పనులు చాలా చక్కగా చేస్తాయి.

అలా ఎన్నో కుక్కలు ఇప్పటి వరకు తమ యజమానులకు మంచి పేరును తెచ్చి పెట్టాయి.

ఇప్పుడు మరో కుక్క వార్తల్లోకి ఎక్కింది. """/"/ఆమద్య ఒక కుక్క బండి తోలడం మనం చూశాం.

ఆ కుక్కను అందరు కూడా వావ్‌ అనుకున్నారు.ఇప్పుడు మరో కుక్క ఏకంగా కారు డ్రైవ్‌ చేసింది.

అది కూడా కొద్ది సమయం కాదు.ఏకంగా గంట పాటు ఆ కుక్క కారును డ్రైవ్‌ చేసింది.

ఆ గంట సమయంలో ఏ ఒక్కరికి కూడా ఏం కాకుండా చాలా జాగ్రత్తగానే కుక్క కారును డ్రైవ్‌ చేసింది.

ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విషయం ఏంటీ అంటే ఆ కుక్క కారును డ్రైవ్‌ చేసింది ముందుకు కాదు రివర్స్‌.

అంటే కుక్క మొత్తం డ్రైవింగ్‌ను రివర్స్‌ లో చేసింది. """/"/కుక్కకు డ్రైవింగ్‌ ఎలా నేర్పారంటూ యజమానిని ప్రశ్నించగా తాను డ్రైవింగ్‌ చేస్తూ ఉంటే చూస్తూ కుక్క డ్రైవింగ్‌ చేయాలనే ఆసక్తిని కనబర్చేది.

అప్పుడప్పుడు నా మీద కూర్చుబెట్టుకుని మరీ నేను డ్రైవింగ్‌ చేసేదాన్ని.అందువల్ల కుక్కకు డ్రైవింగ్‌ అలవాటు అయ్యిందంటూ ఆమె చెప్పుకొచ్చింది.

గేర్లు మార్చి ఇస్తే కుక్క స్టీరింగ్‌ను ఆపరేట్‌ చేస్తుందని ఆ కుక్క యజమాని పేర్కొంది.

కాని ఇది ఎంత మాత్రం కరెక్ట్‌ కాదని, కుక్కతో డ్రైవింగ్‌ చేయించడం చట్ట విరుద్దం అంటూ కొందరు నెటిజన్స్‌ హెచ్చరిస్తున్నారు.

వీడియో వైరల్: మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!