యూపీ మథురలోని బాణసంచా మార్కెట్ లో అగ్నిప్రమాదం
TeluguStop.com
ఉత్తరప్రదేశ్ లోని మథురలోని భారీ అగ్నిప్రమాదం సంభవించింది.బాణసంచా మార్కెట్ లో భారీగా మంటలు ఎగిసి పడ్డాయి.
ఒక షాపు నుంచి మరొక షాపుకు వేగంగా మంటలు వ్యాపించడంతో భారీ నష్టం వాటిల్లింది.
ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారని తెలుస్తోంది.అదేవిధంగా మంటలు భారీగా ఎగిసి పడిన నేపథ్యంలో పలు వాహనాలు మంటల్లో కాలిపోయాయి.
ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా బాణసంచా అమ్మకాలు చేయడంతో ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు.
దీపావళి పండుగ నేపథ్యంలో బాణసంచా మార్కెట్ కు కస్టమర్లు భారీగా వచ్చారని తెలుస్తోంది.
దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం.
అమ్మ ఫ్రైస్‌ను క్యూట్‌గా దొంగిలించిన బుడ్డోడు.. నవ్వులు పూయించే వీడియో వైరల్!