పార్కింగ్ రూల్ బ్రేక్ చేసింది.. రూ.11 లక్షల జరిమానా విధించడంతో..?

వాహనాలు కొన్ని చోట్ల పార్కింగ్ చేస్తే ఇబ్బందులు కొన్నిసార్లు పోలీసులు ఫైన్ కూడా విధించవచ్చు అయితే ఈ ఫైన్ అనేది వేరేలోనే ఉంటుంది కానీ ఒక మహిళకు మాత్రం లక్షల్లో విధించడం జరిగింది.

దాంతో ఆమె లబోదిబోమని ఆవేదన వ్యక్తం చేస్తోంది.వివరాల్లోకి వెళ్తే, ఇంగ్లాండ్‌లోని డార్లింగ్టన్( Darlington In England ) అనే పట్టణంలో హన్నా రాబిన్సన్ అనే మహిళ నివసిస్తుంది.

ఆమె తరచూ ఫీథమ్స్ లెజర్ సెంటర్‌ వద్ద తన కారును తీసుకెళ్లి పార్క్ చేస్తుంది.

ఆమె ఇక్కడ పార్కింగ్ పర్మిట్ కూడా కొనుగోలు చేసింది.అయినప్పటికీ, ఆమెపై 11,000 పౌండ్ల (సుమారు రూ.

11 లక్షలు)కు పైగా జరిమానాలు విధించారు.ఆ పార్కింగ్ ఏరియాను నిర్వహించే కంపెనీ ఒక కొత్త నియమం చేసింది.

ఆ నియమం ప్రకారం, ఎవరైనా ఆ పార్కింగ్ ఏరియాలో 5 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండకూడదు.

"""/" / సినిమాకు వచ్చే వారిని తమ కార్లలో థియేటర్ల వద్ద దింపడానికి కొంతమంది ఆ పార్కింగ్ ఏరియాను ఉపయోగించుకుంటున్నారు.

ఫ్రీగానే దానిని వాడుతున్నారు.అయితే ఈ రూల్‌తో ఆ సమస్యను నిరోధించాలని యూకే( UK ) భావించింది.

హన్నా రాబిన్సన్ అనుకోకుండా ఈ నియమాన్ని ఉల్లంఘించింది.ఆమె కారును పార్క్ చేసినప్పుడు, బయటకు తీసుకెళ్ళినప్పుడు, అక్కడ అమర్చిన కెమెరాలు ఆమె కారును గుర్తించాయి.

ఆ కెమెరాలు ఆమె ఎంత సేపు పార్క్ చేసి ఉంది అనే విషయాన్ని రికార్డు చేసుకున్నాయి.

ఆ లెక్కను బట్టి ఆమె ఐదు నిమిషాల కంటే ఎక్కువ సేపు పార్క్ చేసిందని నిర్ధారించి ఆమెపై జరిమానా విధించారు.

"""/" / హన్నా రాబిన్సన్( Hannah Robinson ) ఈ నియమం గురించి తెలియక, తనపై విధించిన జరిమానా అన్యాయమని భావిస్తుంది.

ఆమె కేవలం ఐదు నిమిషాల కంటే కొంచెం ఎక్కువ సేపే పార్క్ చేసి ఉంటుంది.

అంతేకాకుండా, ఆమె పార్కింగ్ పర్మిట్ కూడా కొనుగోలు చేసింది.అయినప్పటికీ, ఆమెపై భారీ మొత్తంలో జరిమానా విధించడం చాలా అన్యాయంగా ఉంది.

ఈ నియమాన్ని యూకే ఎక్సెల్ పార్కింగ్ సర్వీసెస్ ప్రవేశపెట్టింది.హన్నా ఈ ఫైవ్ మినిట్స్ రూల్ ఎవరూ పాటించలేరని వెల్లడించింది మొబిలిటీ సమస్యలు ఉన్నవారు చిన్న పిల్లలు ఉన్నవారు ఈ రూల్ పాటించడం చాలా కష్టమని ఫైర్ అయ్యింది.

ఇతర డ్రైవర్లు కూడా ఈ రూల్ చాలా అన్యాయంగా ఉందని పేర్కొంటున్నారు.మరి విషయంలో ఏమైనా పునరాలోచిస్తుందో లేదో చూడాలి.

దేవర నిర్మాతల కంటే ఆయనకే ఎక్కువ లాభాలను అందించిందా.. ఏమైందంటే?