ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని 250 మీటర్లు పాదయాత్ర చేసిన అభిమాని!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోని ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా ఎంతో ప్రతి ష్టాత్మకంగా తెరకెక్కిన RRR సినిమా ద్వారా వచ్చే నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30 వ చిత్రాన్ని చేయబోతున్నారు.

ఈ సినిమాలో స్టూడెంట్ లీడర్ గా ఉన్నటు వంటి ఎన్టీఆర్ ఆ తర్వాత రాజకీయాలల్లోకి రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నారని తెలుస్తోంది.

ఇలా సినిమాల్లో మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా ఆయన రాజకీయాలలోకి రావాలని ఎంతో మంది అభిమానులు వారి అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అభిమాని అయినటువంటి సురేష్ గౌడ్ అనే అభిమాని ఏకంగా పాదయాత్ర చేపట్టాడు.

నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గున్ముక్ల గ్రామానికి చెందిన జె.సురేష్ గౌడ్ ఎన్టీఆర్ కి వీరాభిమాని.

గత 15 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ పేరు మీదుగా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నారు.

"""/" / ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కుమారుడి పేరు తన కుమారుడికి పెట్టుకొని తన అభిమానాన్ని చాటు కున్నారు.

ఇలా ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం ఉన్నా సురేష్ గౌడ్ తను రాజకీయాల్లోకి రావాలని బలంగా కోరుకున్నారు.

ఈ క్రమంలోనే ఆయన తన గ్రామం నుంచి శ్రీశైలానికి కాలినడకన సుమారు 250 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.

ఎప్పటికైనా తాను ఎన్టీఆర్ ని కలవాలని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం చూడటమే తన కోరిక అంటూ సురేష్ గౌడ్ చెప్పుకొచ్చారు.

మరి ఈయన కోరిక ఎప్పుడు నెరవేరుతుందో వేచి చూడాలి.ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ హోమ్ మేడ్ సీరం తో లాంగ్ అండ్ స్ట్రాంగ్ హెయిర్ మీ సొంతం..!