పొర్లుదండాలతో తిరుమల చేరుకున్న చిరంజీవి అభిమాని… మరి ఇంత అభిమానం ఏంటయ్యా?
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయనకు ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో అందరికీ తెలిసిందే.
ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.
ఈయన పుట్టినరోజు సందర్భంగా ఎంతో మంది మెగా అభిమానులు వినూత్న రీతిలో చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేశారు.
పలువురు అభిమానులు సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుగా మరి కొంతమంది అభిమానులు పలు ఆలయాలలో ప్రత్యేకంగా పూజలను నిర్వహిస్తూ చిరంజీవి క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు.
"""/" /
ఈ క్రమంలోనే తిరుమలకు చెందినటువంటి ఓ అభిమాని ఏకంగా తిరుమల మెట్ల మార్గం గుండా పొర్లు దండాలు పెడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకుని చిరంజీవి ఆయన కుటుంబ సభ్యులు సంతోషంతో ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కలు చెల్లించారు.
తిరుమల జిల్లా రామచంద్రాపురం మండలం బలిజపల్లికి చెందిన ఈశ్వర్ రాయల్( Eswar Royal )శ్రీవారి మెట్టు మార్గంలో 2388 మెట్ల ద్వారా తిరుమలకు బయలుదేరారు ఇలా పొర్లు దండాలు పెడుతూ ప్రతి ఒక్క మెట్టు ఎక్కుతూ ఈయన స్వామి వారిని దర్శించుకున్నారు.
ఈయన వెంట మెగా అభిమానులు కూడా ఉన్నారు.ఇలా చిరంజీవి క్షేమం కోసం ఈయన పొర్లు దండాలు పెడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నటువంటి వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
"""/" /
అయితే ఈశ్వర్ చిరంజీవి కోసం ఇలా చేయడం ఇది మొదటిసారి కాదు గత 20 సంవత్సరాలుగా ప్రతి ఏడాది చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పలు ఆలయాలలో ఇలా మొక్కులు చెల్లించుకుంటూ ఆయన క్షేమం కోరుకుంటున్నారు.
ఇలా చిరంజీవి కోసం పొర్లు దండాలు పెడుతూ మొక్కులు చెల్లించుకున్నారనే విషయం తెలియడంతో అందరూ అభిమానం ఉండాలి కానీ మరీ ఇంత అభిమానం ఏంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ఆయన చివరిగాభోళా శంకర్( Bhola Shankar ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రెండు సినిమాలను అధికారికంగా ప్రకటించారు.
ఓరి దేవుడా.. సిటీ స్కాన్ రిపోర్టు చూసి అబ్బురపోయిన డాక్టర్లు..