జంతువుల్లా న‌డుస్తున్న కుటుంబం.. విష‌యం తెలిస్తే గుండెలు త‌రుక్కుపోతాయి..

మ‌నుషుల్లో ఈ భూమ్మీద చాలామంది ఉన్నారు.ఇందులో ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా ఉంటారు.

ఆయా ప్రాంతంలో ఉన్న కొన్ని వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల కార‌ణ‌గా కావ‌చ్చే లేదంటే వేరే ఇత‌ర జ‌న్యుప‌ర‌మైన కార‌ణాల వ‌ల్ల వారు అంద‌రికంటే చాలా విభిన్నంగా ఉంటారు.

అయితే సాధార‌ణంగా మ‌నుషులు ఎలా న‌డుస్తారు అంటే మీరు చెప్పే ఆన్స‌ర్ ఏంటి.

హా ఇంకేముంది కాళ్ల మ‌ద న‌డుస్తారు అని అంటారు క‌దా.అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయే మ‌నుషులు మాత్రం కాళ్ల మీద కాకుండా జంతువులా కాళ్లు, చేతుల మీద న‌డుస్తారు.

ఇలా కేవ‌లం  జంతువులు మాత్ర‌మే న‌డుస్తాయి.కానీ ఎందుకో వీళ్లు పుట్టిన‌ప్ప‌టి నుంచి ఇలాగే న‌డుస్తున్నారు.

టర్కీ దేశంలోని ఓ కు గ్రామంలో నివ‌సిస్తున్న రెసిట్, హాటిస్ ఉలాస్ అనే కుటుంబ స‌భ్యులు ఇలా కాళ్లు, చేతుల మీద న‌డుస్తున్నారు.

అయితే వీరి గురించి అధ్య‌యంనం చేసిన సైంటిస్టులు షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించారు.వీరికి జన్యుపరమైన సమస్య ఉంద‌ని, ఇది అంద‌రికీ ఇలాగే ఉండ‌టంతో వారంతా చిన్న‌ప్ప‌టి నుంచే ఇలా న‌డుస్తున్నారంటూ వివ‌రించారు.

అంతే కాకుండా వీరు మ‌నుషుల‌కు చాలా దూరంగా నివ‌సిస్తున్నార‌ని, వీరు నాగ‌రిక‌త‌ను తెలుసుకోవ‌ట్లేద‌ని సైంటిస్టులు వెల్ల‌డించారు.

"""/" / వీరికి రెండు పాదాలు స‌రిగ్గా బ్యాలెన్స్ చేయలేక ఇబ్బంది ప‌డుతున్నారు.

కాళ్ల మీద శ‌రీరాన్ని నిల‌బెట్ట‌డం వీరికి క‌ష్టం అవుతుంది.హేటిస్ పిల్ల‌లు దాదాపు 19 మంది.

ఈ పిల్ల‌ల్లో ఐదుగురు చేతులు, కాళ్లు సాయంతో న‌డుస్తున్నారు.వీరంద‌రి వ‌య‌సు 25 నుండి 41 ఏండ్ల దాకా ఉంది.

వీరిని గ‌తంలో చాలా అవ‌మానించేవార‌ని, ఊర్లోకి కూడా రానిచ్చేవారు కాద‌ని వెల్ల‌డించారు.కానీ ఇప్పుడు వీరు కూడా ఊర్లోనే నివ‌సిస్తున్నార‌ని, కుర్దిష్ భాష కూడా తెలుసుకున్నార‌ని, దీంతో వారు కూడా నేడు అంద‌రిలాగే సాధార‌ణ జీవనాన్ని సాగిస్తున్నారంటూ  వివ‌రించారు.

రాజకీయ లబ్దికోసమే షర్మిల ఆరోపణలు..: ఏఏజీ పొన్నవోలు