తల్లిదండ్రులు దూరమయ్యారనే మనస్థాపంతో మూడేళ్లుగా ఇంటికే పరిమితమైన ఓ కుటుంబం..

తల్లిదండ్రులు దూరమయ్యారనే మనస్థాపంతో ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు మూడేళ్లుగా రాత్రింపగలు ఇంటికే పరిమితమైన ఘటన అనంతపురము పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అనంతపురం వేణుగోపాల్ నగర్ లో నివసిస్తున్న అంబటి తిరుపాలశెట్టికి అక్క విజయలక్ష్మి చెల్లెలు కృష్ణవేణి ఉన్నారు.

వీరు అవివాహితులు వారి తండ్రి 2016లో తల్లి 2017లో అనారోగ్యంతో చనిపోయారు దీంతో వారు మానసికంగా బాగా కుంగిపోయారు బయట ప్రపంచంతో సంబంధాలు తెంచుకున్నారు వారి తల్లిదండ్రులు బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బుల వడ్డీని నెలకు ఒకసారి తిరుపాల్ తెచ్చుకుంటారు.

అయినే రోజు అరగంట పాటు బయటకెళ్ళి కావలసిన భోజనాలు త్రాగునీరు తెస్తారు.ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటారు.

బిల్లు చెల్లించకపోవడంతో రెండేళ్ల కిందట విద్యుత్ అధికారులు ఇంటికి సరఫరా నిలిపివేశారు.అప్పటినుండి రాత్రిళ్ళు చీకటిలోనే గడుపుతున్నారు.

దీన్ని గమనించి పలువురు కాలనీవాసులు శుక్రవారం వారి ఇంటి వద్దకెళ్లి బలవంతంగా తలుపులు తెరిపించారు.

మూడేళ్లుగా బయటకు రాకపోవడంతో మహిళ లిద్దరి జుట్టు జడలు కట్టాయి.మాసిన దుస్తులు మురికి దేహాలతో కనిపించారు.

తమ అమ్మానాన్న చనిపోయాక కుంగుబాటుకు లోనయ్యామని అందుకే బయటి ప్రపంచంలోకి రాకుండా ఇంటికే పరిమితమైయ్యామని మేము ఎవ్వరికి ఏలాంటి ఇబ్బంది కలిగించలేదని మాఇంట్లో ఉంటు కొన్ని సనస్యలతో బాదపడుతున్నామని త్వరలోనే జనజీవనంలోకి రావడానికి ప్రయత్నిస్తామని బాధితులు తిరుపాల్ శెట్టి తెలిపారు.

విద్యుత్ సరఫరా పునరుద్దించుకుంటామని అన్నారు.

విద్యార్థుల్లో అలాంటి ప్రతిభ చూసి పేరెంట్స్ షాక్.. వీడియో వైరల్..