సముద్రంలో పడిన కుక్కని కాపాడిన డాల్ఫిన్.. ఈ వీడియో చూస్తే!
TeluguStop.com
నీటిలో బతికే డాల్ఫిన్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి.ఇవి చాలా స్మార్ట్ కూడా.
ఇక నేలపై బతికే కుక్కలు చాలా సన్నిహితంగా మెలుగుతాయి.ఇవి కూడా చాలా స్మార్ట్.
ఈ రెండు జంతువులు కలిసి ఫ్రెండ్షిప్ చేస్తే అద్భుతంగా ఉంటుంది కదా.ఒకదానికొకటి సహకరించుకుంటూ, కష్టంలో సహాయం చేసుకుంటూ ఉంటే ఆ దృశ్యాన్ని చూసినప్పుడు మనకి కూడా చాలా ఆనందం అవుతుంది.
అయితే తాజాగా అందరినీ ఫిదా చేసే ఒక వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో కుక్క, డాల్ఫిన్ కలిసి ఫ్రెండ్‌షిప్ చేస్తున్నాయి.కుక్క సముద్రం నీటిలో పడి పోయి మునిగిపోతుండగా డాల్ఫిన్ దానిని ఆ ప్రమాదం నుంచి కాపాడింది.
అనంతరం ఇవి రెండూ కూడా సైగలతో మాట్లాడుకుంటూ తమ స్నేహాన్ని చాటాయి.వీటి ఫ్రెండ్‌షిప్‌కి సంబంధించిన వీడియోను తాజాగా ఐఏఎస్ అధికారి అర్పిత్ శర్మ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
ఈ వీడియోకి ఇప్పటికే లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి.జంతువులకు కూడా ఫీలింగ్స్ ఉంటాయని ఈ వీడియోకి ఐఏఎస్ ఆఫీసర్ ఒక క్యాప్షన్ జతచేశారు.
ఈ బ్యూటిఫుల్ యానిమల్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.వైరల్ అవుతున్న వీడియోలో నీటిలో పడిపోయిన కుక్కని డాల్ఫిన్ తన వీపుపై ఎక్కించుకోవడం చూడవచ్చు.
అనంతరం ఆ డాల్ఫిన్ మెల్లగా ఈదుకుంటూ వచ్చి ఒక బోట్‌లోకి కుక్కను ఎక్కించింది.
దాంతో కుక్క బతికిపోయింది.అనంతరం ఇవి రెండూ ఒకదానికొకటి తమ భాషలో మాట్లాడుకుంటూ కనిపించాయి.
ఈ జంతువులు చాలా సంతోషంగా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఎంజాయ్ చేశాయి.అనంతరం డాల్ఫిన్ నీటిలో విన్యాసాలు చేస్తూ కుక్క ని బాగా ఎంటర్‌టైన్ చేసింది.
కాగా ఈ రెండు జంతువుల స్నేహం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు
.
ఒకప్పుడు సైడ్ ఆర్టిస్ట్… ఇప్పుడు మాత్రం క్రేజీ హీరోయిన్. ఈ బ్యూటీ ఎవరో మీకు తెలుసా?