Prabhas : ప్రభాస్ తో సినిమా చేసే డైరెక్టర్ ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలా..?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) గురించి మన ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా పాన్ ఇండియాలో కూడా తన సత్తా చాటుకున్నా ఏకైక హీరోగా కూడా ప్రభాస్ చాలా మంచి గుర్తింపు పొందాడు.
ఇక ప్రభాస్ బాహుబలి సినిమా( Baahubali ) తర్వాత చేసిన వరుస సినిమాలు ప్లాప్ అయినప్పటికీ ఆయన చేసిన ప్రతి సినిమా 300 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి సరికొత్త రికార్డ్ ను కూడా క్రియేట్ చేశాడు.
"""/" /
ఇక ఇప్పటి వరకు ఆరు సినిమాలతో 200 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టిన ఏకైక హీరో కూడా ప్రభాస్ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక ఇదిలా ఉంటే గత సంవత్సరం వచ్చిన సలార్ సినిమాతో ఇప్పటికే పెను ప్రభంజనాన్ని సృష్టించాడు.
ఇక ఇలాంటి ప్రభాస్ తో సినిమా చేయడానికి ఇండియాలో ఉన్న దర్శకులందరూ పోటీ పడుతున్నారు.
మరి ఇలాంటి సమయంలో ఆయనతో సినిమాలు చేసే దర్శకులు ఈ మూడు విషయాలు మాత్రం పక్కాగా గుర్తుంచుకోవాలని చాలామంది సిని మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తున్నారు.
"""/" /
ఇక అందులో మొదటిది ఆయన ఇమేజ్ కు తగ్గట్టుగా కథను డిజైన్ చేసుకోవాలి, ఇక రెండోది ఆయన అభిమానులు ఆయన ఎలాగైతే చూడాలి అనుకుంటున్నారో అలాంటి క్యారెక్టర్ లో అతన్ని చూపించే ప్రయత్నం చేయాలి.
మూడోది ఆ సినిమాలో ఎలివేషన్స్ మాత్రం చాలా పీక్ స్టేజ్ లో ఉంటేనే ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని చెబుతున్నారు.
ఇక దర్శకులు కూడా ఈ విషయాలను చాలా బాగా ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తుంది.
చూడాలి మరి ఇప్పుడు ప్రభాస్ చేసే సినిమాలు ఎలాంటి రిజల్ట్ ను ఇస్తాయో.
బన్నీ అరెస్ట్ ముందూ వెనుక జరిగింది ఇదే.. ఈ వివాదం విషయంలో ట్విస్టులివే!