సామాన్యుడి చేతిలో వజ్రాయుధం సమాచార హక్కు చట్టం

నల్లగొండ జిల్లా:సమాచార హక్కు చట్టం( Right To Information Act ) సామాన్యుడి చేతిలో వజ్రాయుధం లాంటిదని సామాజిక కార్యకర్త తగరం శ్రీను అన్నారు.

గురువారం నల్లగొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ప్రాంగాణంలో సమాచార హక్కు చట్టం -2005,19వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించి,కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకున్నారు.

ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ పరిపాలనలో పారదర్శకత కొరకు 2005లో కేంద్ర ప్రభుత్వంచే సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిందన్నారు.

చట్టం వచ్చి 19 ఏళ్లు అయినా ప్రభుత్వ కార్యాలయాల్లో సూచిక బోర్డులు కనిపించడం లేదన్నారు.

ప్రతి పౌరుడు ఈ చట్టాన్ని వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో తహాశీల్దార్,ఎంపిడిఓ,కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఫోటో వైర‌ల్‌: ఇదేందయ్యా ఇది.. ఫ్యామిలీ మొత్తానికి క‌టౌట్‌ పెట్టేసారుగా