అసోం -నాగాలాండ్ సరిహద్దులో ఘోర అగ్నిప్రమాదం

అసోం -నాగాలాండ్ సరిహద్దులో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని లాహోరిజాన్ లో సుమారు రెండు వందలకు పైగా ఇళ్లు దగ్ధం అయ్యాయి.

ఒక్కసారిగా మంటలు భారీగా ఎగసిపడటంతో భారీ సంఖ్యలో దుకాణాలు కాలి బూడిదయ్యాయి.స్ధానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

టాలీవుడ్ ఐటీ దాడుల వెనుక బాలీవుడ్ మాఫియా.. షాకింగ్ విషయాలు వైరల్!