చ‌నిపోయిన దూడ వెంటే కిలో మీట‌ర్లు ప‌రిగెత్తుకొచ్చిన ఆవు..

సృష్టిలో తల్లి ప్రేమను మించిన‌ది ఏది లేదు.నోరున్నా లేప‌పోయినా అది స‌హ‌జం.

జంతువులు, ప‌క్షులు, మ‌నుషులకు త‌ల్లి ప్రేమ అంద‌రిదీ స‌మాన‌మే.జాతి ఏదైనా తల్లి ఎవ‌రికైనా తల్లే.

పేగుబంధం ఒక్క‌టే.మ‌మ‌కారం అన్నింటికి వ‌ర్తిస్తుంది.

త‌ల్లి చూపించే ప్రేమ కూడా స‌మాన‌మే.తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ సంఘటన చూస్తే అందరి మనసులు క‌ల‌చివేస్తుంది.

జ‌రిగిందేమిటంటే.రాజమహేంద్రవరంలో పది రోజుల కిందట దూడను బైక్ ఢీకొట్టింది.

రహదారిపై గాయాలతో ఉన్న దూడను జంతు ప్రేమికులు గోశాల‌కు త‌ర‌లించి చికిత్స అందించారు.

అయినా కానీ ఆ దూడ మృతి చెందింది.మృతిచెందిన ఆవు దూడకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జ‌రిపించారు.

అంత్య‌క్రియ‌కు వ్యానులో దూడ డెడ్ బాడీని ఉంచి.డప్పులు తీసుకెళుతున్నారు.

అయితే త‌న బిడ్డను తీసుకెళ్తుంటే తట్టుకోలేని ఆ తల్లి.రోడ్డు వెంట స్మశానం వరకూ వ్యాను వెంబ‌డే ప‌రుగులు పెట్టింది.

అడుగడుగునా.ఆ వ్యానుకు అడ్డుప‌డింది.

ఏడుస్తూ తన ఆవేదన వ్యక్తం చేసింది.ఆ ఆవు వెంట మరో ఆవు కూడా వ్యాను వెంబ‌డి ప‌రుగులు తీయడంతో అంద‌రూ ఆశ్ఛ‌ర్యానికి గుర‌య్యారు.

కళ్లలో దుఃఖాన్ని ఉంచుకొని దూడ కోసం ఆరాట‌ప‌డింది.మ‌ళ్లీ రాద‌ని తెలుసుకొని గుండెలు ప‌గిలేలా రోడ్డు వెంట ప‌రిగెత్తింది.

రోడ్డు వెంట వాహనాలు వస్తున్నా ఆవు ప‌రుగు ఆగ‌లేదు.ఏదైనా వాహనం తగిలితే తన ప్రాణాలు పోతాయన్నభ‌యం కూడా లేకుండా స్మశానం వరకూ పరుగులు తీసింది.

"""/"/ ఆ తర్వాత సంప్రదాయ పద్ధతిలో దూడకు అంత్యక్రియలు జ‌రిపించారు జంతు ప్రేమికులు.

ఆవు దూడ ప్రేమ‌ను చూసి స్థానికులు ఆశ్ఛ‌ర్య‌పోయారు.ద‌గ్గ‌రి వాళ్లే స్మశానానికి రాని ఈ రోజుల్లో.

మూగ జీవాలు పరిగెత్తడం చూసి అక్క‌డున్న వారంద‌రూ కంటతడి పెట్టుకున్నారు.ఎంతైనా త‌ల్లిప్రేమ ఏ జంతువుకు అయినా ఒక్క‌టే క‌దా.

అవును మ‌రి.

ఆ కుటుంబంలో ముగ్గురూ ఐఏఎస్ లే.. అనూషా పిళ్లై సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!