కడప జిల్లా మైలవరం జలాశయంలో దూకి దంపతులు ఆత్మహత్య

కడప జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.మైలవరం జలాశయంలో దూకి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఇద్దరు పిల్లలను జలాశయం వద్ద వదిలేసి నీళ్లలో దూకి దంపతులు బలవన్మరణం చెందారు.

మృతులు మైలవరం మండలం వేపరాలకు చెందిన గోవర్ధన్ దంపతులుగా గుర్తించారు.జలాశయం వద్ద తల్లిదండ్రుల కోసం చిన్నారుల రోదనలు మిన్నంటుతున్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు.మృతుడు గోవర్ధన్ హైదరాబాద్ లో మెడికల్ రిప్రజెంటెటివ్ గా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అయితే దంపతులు ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

ఛీ, రైలు టాయిలెట్‌లో టీ పాత్రలు కడుగుతున్నాడుగా.. వీడియో చూస్తే వాంతి చేసుకుంటారు!