మొక్కు చెల్లించుకున్న కాంగ్రెస్ అభిమాని…!

సూర్యాపేట జిల్లా:అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ( Congress Party )విజయం సాధించడంతో ఆ పార్టీ వీరాభిమాని గుండు చేయించుకొని మొక్కు చెల్లించుకున్నాడు.

కోదాడ మండల పరిధిలోని బిక్యతండాకు చెందిన గుగులోతు వీరన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, కోదాడ,హుజుర్ నగర్ నుండి పద్మావతి రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Padmavathi Reddy )భారీ మెజారిటీతో గెలిస్తే ఎర్రవరం బాల ఉగ్ర లక్ష్మినర సింహాస్వామి ఆలయం వద్ద గుండు చేయించుకుంటానని మొక్కుకున్నాడు.

కోరిక నెరవేరడంతో అతను గురువారం ఆలయం వద్ద తన మొక్కులు చెల్లించుకున్నాడు.రానున్న స్ధానిక సంస్థల ఎన్నికలు, ఎంపీ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అన్నాడు.

కొత్త బడ్జెట్‌ లో ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుందంటే?