మోసగాడితో ప్రేమలో పడ్డ చైనా మహిళ.. చివరికి ఎంత నష్టపోయిందో తెలిస్తే…?
TeluguStop.com
ఆన్‌లైన్‌లో మోసాలు బాగా పెరిగిపోతున్నాయి.ఇంటర్నెట్‌లో పరిచయమైన వారిని ఎట్టి పరిస్థితులలో నమ్మకూడదని పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు.
అయినా కొంతమంది అమాయకులు వారిని నమ్మి మోసపోతున్నారు.ఈ మోసాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి.
తాజాగా చైనాకు చెందిన ఒక మహిళ మోసగాడితో ప్రేమలో పడి చివరికి రూ.
11 లక్షలు నష్టపోయింది. """/" /
వివరాల్లోకి వెళితే, షాంఘై( Shanghai )కి చెందిన 40 ఏళ్ల మహిళ 'హు' ఆన్‌లైన్‌లో 'చెన్' అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది.
గత ఏడాది మే నెలలో ఒక డేటింగ్ సైట్ ద్వారా వీరిద్దరూ కనెక్ట్ అయ్యారు.
చెన్ చాలా నమ్మదగిన వ్యక్తిలా కనిపించి, 'అధిక రాబడి' ఇచ్చే ఒక పెట్టుబడి ఖాతా గురించి హుకు చెప్పాడు.
అతని మాటలను నమ్మి, హు భారీ మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టింది.కానీ, ఆమె డబ్బును విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించినప్పుడు, అది ఒక మోసం అని తెలుసుకుంది.
"""/" /
చెన్ మోసగాడు అని తెలిసినప్పటికీ, హు అతనిపై తన భావాలను మార్చుకోలేదు.
ఉత్తర మయన్మార్( Myanmar ) నుంచి తిరిగి రావడానికి అవసరమవుతాయని చెప్పినప్పుడు ఆమె మళ్ళీ నమ్మేసింది.
అతను ఆమెను మరింత మోసం చేస్తూ ఎక్కువ డబ్బులు దోచేశాడు.జోక్ ఏంటంటే ఆమె సహాయంతో అతడు మరిన్ని మోసాలు చేశాడు.
అలా ఆమెను తన సైబర్ ఫ్రాడ్స్ లో భాగం చేశాడు.ఈ కేసులను టేకప్ చేసిన పోలీసులకు లావాదేవీలు హు ఖాతా ద్వారా జరిగాయని తెలిసాయి, కాబట్టి పోలీసులు ఆమెను పట్టుకున్నారు.
లాభాలను తీసుకోకుండా, బాధితురాలిలా నటిస్తే సురక్షితంగా ఉండవచ్చని చెన్ ఆమెను ఒప్పించాడు.సెప్టెంబర్‌లో, హును పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆమె తన తప్పును ఒప్పుకుంది.అయితే, ఆమె కూడా మోసంలో పాల్గొన్నదని తేలినందున, ఆమెకు రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.
చూశారు కదా ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తి కారణంగా ఈ చైనీస్ మహిళా జీవితం ఎలా నాశనమైందో కాబట్టి ఎంత మంచిగా మాట్లాడినా సరే అపరిచిత వ్యక్తులను నమ్మకూడదు.
మహేష్ జక్కన్న మూవీ ముహూర్తం ఫిక్స్.. ఆరోజు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పండగే!