అథ్లెట్ల కంటే వేగంగా పరిగెత్తిన కెమెరామెన్‌!

అథ్లెట్ల కంటే వేగంగా పరిగెత్తిన కెమెరామెన్‌!

విస్తుగొలిపే ఘటనలు అప్పుడప్పుడు మనం సోషల్‌ మీడియాలో చూస్తూనే ఉంటాం.అవి కొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి.

అథ్లెట్ల కంటే వేగంగా పరిగెత్తిన కెమెరామెన్‌!

ఎందుకంటే ఎన్నడూ చూడని వీడియోలు చూస్తే అలాగే ఉంటుంది.తాజాగా జరిగిన ఈ వీడియో చూస్తే ఆశ్యర్యం కలుగుతుంది.

అథ్లెట్ల కంటే వేగంగా పరిగెత్తిన కెమెరామెన్‌!

ఔరా! అనిపించే కెమెరామెన్‌ సత్తా చూస్తే అలాగే అనిపిస్తుంది.ఎందుకంటే రన్నింగ్‌ రేస్‌లో అథ్లెట్ల వీడియో తీస్తూ ఏకంగా వారి కంటే ముందు పరిగెత్తి మరీ వీడియో షూట్‌ చేశాడు.

అయితే, ఇది ఒక వాణిజ్య ప్రకటను కోసం తీసిన వీడియో! కానీ, ఇలాంటి ఘటన చైనాలో నిజంగానే జరిగింది.

ఓ స్టేడియంలో రన్నింగ్‌ రేస్‌ను కెమెరామెన్‌ రికార్డు చేయాల్సి ఉంది.దీంతో ఆయన ఆ రన్నింగ్‌ రేసును షూట్‌ చేయడానికి ఏకంగా ఆ అథ్లెట్ల కంటే ముందే పరిగెత్తి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఈ సంఘటన షాంకీ ప్రొవిన్స్‌లోని డాటంగ్‌ యూనివర్శిటీలో చోటు చేసుకుంది.ఈ మధ్య అక్కడ అథ్లెటిక్స్‌ పోటీలు జరిగాయి.

ఈ నేపథ్యంలో 100 మీటర్ల పరుగు పందెం నిర్వహించారు.పోటీ మొదలవ్వగానే ఆడియాన్స్‌ చూపంతా క్రీడాకారులపై కాకుండా ఆ వీడియో షూట్‌ చేస్తున్న కెమెరామెన్‌పై పడింది.

ఎందుకంటే అతడు అథ్లెట్ల కంటే స్పీడ్‌గా పరిగెత్తి మరీ వీడియో రికార్డు చేశాడు.

వారి కంటే ముందు పరిగెత్తి పోటీలో రికార్డు బ్రేక్‌ చేశాడు.ఇది మొత్తం ఆ స్టేడియంలో ఉన్న మరో కెమెరాలో రికార్డు అయ్యింది.

ప్రస్తుతం ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.ఇది వైరల్‌ అవుతోంది.

"""/"/ పోస్ట్‌ చేసిన వెంటనే విశేష స్పందన లభిస్తోంది.సాధారణంగా కెమెరా బరువు ఇతర పరికరాలు కలిపి దాదాపు ఓ నాలుగు కిలోల మేర ఉంటుంది.

ఆ బరువును పట్టుకుని కూడా అథ్లెట్ట కంటే స్పీడ్‌గా పరిగెత్తడం నిజంగానే అబ్బుర పరిచే విషయమే కదా! ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ కెమెరామెన్‌ సత్తాకు ఫిదా అయిపోయారు.

అతడికి కచ్చితంగా పతకం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.ఆ కెమెరామెన్‌ స్పీడ్‌ చూస్తే కచ్చితంగా అతగాడు విజేత కంటే ముందే ఉంటాడని అంటున్నారు.

మరికొందరు అతగాడిని కూడా వరల్డ్‌ రన్నింగ్‌ రేస్‌లకు పంపిస్తే తప్పకుండా విజేతగా నిలుస్తాడని ప్రశంసలు గుప్పిస్తున్నారు.

మన సీనియర్ హీరోలు చేస్తున్న సినిమాలతో భారీగానే ప్లాన్ చేస్తున్నారా..?

మన సీనియర్ హీరోలు చేస్తున్న సినిమాలతో భారీగానే ప్లాన్ చేస్తున్నారా..?