వైరల్ : ఒంటికాలుతో తన కలలను నిజం చేసుకుంటున్న చిన్నారి.. ఎందరికో స్ఫూర్తిదాయకం!

అవయవాలు అన్ని సరిగ్గా వున్నా సరే కొంతమంది అవకాశాలు సరిగ్గా వినియోగించుకోరు సరికదా ఎదుటివారిని నిందిస్తూ వుంటారు.

అయితే ఇక్కడ ఈ చిన్నారికి ఓ కాలు లేదు.ఒంటికాలుతోనే నడుస్తుంది.

అయితేనేం.పట్టుదల ఉంటే ఎలాగన్నా అనుకున్నది సాధించి తీరొచ్చు అని ఆమెను చూసిన ఎవ్వరికైనా అర్ధం అవుతుంది.

అవును.తన అంగవైకల్యాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా, కష్టపడి అనుకున్న గమ్యానికి చేరుకొనే దిశగా ఆ చిన్నారి వేస్తున్న అడుగులను చూస్తే, ఎలాంటివారికైనా మనసు ఉప్పొంగిపోతుంది.

వివరాళ్లోకెలితే.బిహార్‏, జాముయి జిల్లాకు చెందిన సీమా అనే బాలిక 2 సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదంలో ఒక కాలు కోల్పోయింది.

దీంతో ఒంటికాలుకే పరిమితమైపోయింది.చదువుకోవాలనే ఆరాటం ముందు విధి చేసిన గాయం ఏమాత్రం అడ్డుగా మారలేదు ఆ పాపకు.

పంటిబిగువున బాధను బిగబట్టి.ఒంటికాలుతో కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్ కు వెళ్తోంది.

ఒంటికాలుతో పాఠశాలకు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ్ వైరల్ అయ్యింది.దీంతో రియల్ హీరో సోనూసూద్ ఆమె పట్టుదలకు కరిగిపోయి ఈ చిన్నారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

"""/" / సోను సూద్ స్పందిస్తూ."ఆ చిన్నారి ఇప్పుడు 2 పాదాలపై పాఠశాలకు వెళ్తుంది.

ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? ఆమెకి ఇపుడు టికెట్ పంపుతున్నాను.ఆ చిన్నారి 2 కాళ్లపై నడించే సమయం ఆసన్నమైంది" అంటూ తన ఎన్జీవ్ సూధా ఫౌండేషన్ ను ట్యాగ్ చేశారు.

అంతేకాకుండా.ఈ చిన్నారి వీడియోపై ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్ సైతం స్పందించారు.

చదువుకోసం అంగవైకల్యాన్ని లెక్కచేయాని ఆ చిన్నారిని ఆకాశానికెత్తేశారు.తనవంతు సాయం చేయడానికి సిద్ధంగా వున్నానని అన్నారు.

ధనస్సు ఆకారంలో అద్భుత రామాలయం.. ఎక్కడుందో తెలుసా..!