సముద్రంలోని జీవుల మనుగడ కోసం ఎవరు చేయని సాహసం చేసిన ఒక చిన్నారి..!

గొప్ప పనులు చెయాలంటే వయసుతో పనిలేదని నిరూపించింది ఈ బాలిక.మనసులో అనుకున్న పని చేయాలనె దృఢ నిశ్చయం ఉంటే ఏ పని అయినగాని చిన్నదిగానే ఉంటుంది అంటుంది ఈ చిన్నారి.

ఈ పాప వయసులోనే చిన్నది కానీ తన మనసు మాత్రం ఎంతో విశాలమైనది చిన్న వయస్సులోనే సముద్రంపై అందులో ఉండే సముద్ర జీవుల మీద ఎంతో అనురాగాన్ని పెంచుకుంది.

వాటి మనుగడను కాపాడే క్రమంలో తన తండ్రితో కలసి సముద్ర తీరంలోని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే పనిలో ఎనిమిదేళ్ల తాగరై ఆరాధన అనే చిన్నారి.

ఈ చిన్నారి తమిళనాడులో ఉంటుంది.చిన్నప్పటి నుండి ఆరాధన సముద్రం పట్ల, అందులో నివసించే జీవుల పట్ల ఇష్టాన్ని పెంచుకుంది.

ఆరాధన తండ్రి అయిన అరవింద్ ఒక స్కూబా డ్రైవర్.తన కూతురు ఆరాధనకు ఐదేళ్లు వయసు నుంచే స్కూబా డ్రైవింగ్ లో శిక్షణ ఇచ్చాడు.

అలా ఆరాధన సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఎన్నో ప్లాస్టిక్ కవర్లను, వ్యర్థాలను చూసింది.అయితే వాటిని తిని సముద్ర జీవులు మృత్యువాత పడడం ఆరాధన మనసును ఎంతగానో బాధపెట్టింది.

దాంతో సముద్రంలో, సముద్ర తీరంలోని వ్యర్థాలను తొలగించేందుకు ముందడుగు వేసింది.అయితే ఆరాధన తండ్రి అయిన అరవింద్‌తో కలసి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే పనిలో పడింది.

వారిద్దరూ కలసి కేవలం మూడు నెలల్లోనే 600 వందల కేజీలకు పైగా వేస్ట్‌ను సముద్ర ప్రాంతంలో కలెక్ట్ చేశారు.

అలా కలెక్ట్ చేసిన వాటిని రీసైక్లింగ్‌ కు పంపిస్తున్నారు.అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలను కొనే షాపులకు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బును తమిళనాడులోని పర్యావరణ పరిరక్షణ విభాగానికి విరాళంగా ఇవ్వాలని ఆరాధన అనుకుంటున్నట్లు తెలిపింది.

"""/"/ అంతేకాకుండా ఆరాధన పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి తనవంతు కృషి చేస్తుంది.

పైగా ఇలా చేయడం తనకు ఎంతో సంతృప్తినిస్తుందని, నేను చేసే పని వలన సముద్ర జీవులను కాపాడుతున్నాననే భావన నా మనసుకు ఎంతో ఆనందానిస్తుందని ఆరాధన చెబుతోంది.

నిజంగా ఇంత చిన్న వయసులో ఆరాధన ఎంత గొప్పగా ఆలోచిస్తుందో కదా.

ఎన్టీఆర్ ఫ్యాన్ చేసిన పని తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. తారక్ ను చూడాలని 300 కిలోమీటర్లు నడిచాడా?