కారు బానెట్‌పై చిన్నారి కూర్చోబెట్టి రోడ్డుపై ఏకంగా..? (వీడియో)

తాజాగా రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలో గుర్జార్ కా ధాబా (Rajasthan, Jhalawar District, Gurjar Ka Dhaba)సమీపంలోని జాతీయ రహదారి 52పై ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది.

ఓ వ్యక్తి చిన్నారిని కారుపై బానెట్‌పై(Car Bonnet) కూర్చోబెట్టి నడుపుతున్న వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో కారు నంబర్ ప్లేట్ స్పష్టంగా కనిపించకపోవడంతో, పోలీసులు ఘటనపై వెంటనే స్పందించకాలేకపోయారు.

అయితే చివరకు ఈ ఘటనపై స్థానిక DSP హర్షరాజ్ సింగ్ ఖరేడా ఈ సంఘటనను ధృవీకరించారు.

డ్రైవర్ ఉద్దేశపూర్వకంగానే ఈ స్టంట్ చేసి చిన్నారి ప్రాణాలకు ముప్పు తెచ్చాడని గుర్తించారు.

పిల్లల భద్రతకు పెను ప్రమాదాన్ని ఈ ఘటన ప్రతిబింబిస్తుంది. """/" / వైరల్ వీడియో ఆధారంగా కారు నంబర్(Car Number) గుర్తించి, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

చట్టాన్ని ఉల్లంఘించిన డ్రైవర్‌ను అరెస్టు చేసి, సంబంధిత చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.ఈ ఘటన పిల్లల భద్రతపై అందరికీ హెచ్చరికగా నిలుస్తోంది.

ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కేవలం చిన్నారులకే కాకుండా, ఇతర ప్రయాణికుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని ఈ సంఘటన స్పష్టంగా తెలియజేస్తుంది.

వైరల్ వీడియోను చూసిన నెటిజన్లు డ్రైవర్ నిర్వాకాన్ని ఖండిస్తున్నారు.ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా భవిష్యత్తులో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లల భద్రతను మొదటి ప్రాధాన్యతగా చూడాలని వారు కోరుతున్నారు.

ఈ సంఘటన పట్ల స్పందించిన పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవడం సమాజానికి ఒక గుణపాఠంగా మారింది.

పిల్లల భద్రతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత.ఈ వీడియో చూసిన నెటిజన్స్ పిల్లల పట్ల నిర్లక్షయం వద్దు అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం ఈ డేంజర్ వీడియోను మీరు కూడా చూసి ఏమనిపించుందో కామెంట్ చేయండి.

రామ్, విజయ్ దేవరకొండ ఈ ఇద్దరికి పాన్ ఇండియాలో డిజస్టర్లను కట్టబెట్టిన ఏకైక దర్శకుడు ఎవరో తెలుసా..?