కొడుకేమో ప్రపంచ కుబేరుడట.. కానీ తల్లేమో సొంత ఇల్లు లేక గ్యారేజ్‌లో నిద్రించిన వైనం?
TeluguStop.com
కొడుకేమో ప్రపంచ కుబేరుడు.కానీ తల్లేమో సొంత ఇల్లు లేక గ్యారేజ్‌లో నిద్రపోతోంది పాపం.
ఇంతకీ ఆ కుబేరుడు ఎవరంటే ఎలన్ మస్క్.ఎలన్ మస్క్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
మరి గుట్టలకొద్దీ అంత డబ్బు వున్నపుడు అతడి తల్లి మంచి విలాసవంతంగా జీవిస్తుందేమో అని అనుకుంటారు కదా.
కానీ, ఇటీవల ఆమె తన కొడుకును చూసేందుకు వెళ్లినప్పుడు ఒక గ్యారేజ్‌లో నిద్రపోయారట.
ఈ విషయాన్ని స్వయంగా ఆమే ఒక మీడియా సంస్థకు వెల్లడించారు.విషయం ఏమంటే, ఎలన్ మస్క్ తల్లి మయే మస్క్ కొంతకాలం క్రితం టెక్సాస్‌లోని మస్క్ దగ్గరికి వెళ్లింది.
అయితే, అక్కడ సరైన నివాస లేని కారణంగా ‘స్పేస్ ఎక్స్’ కార్యాలయంలోని గ్యారేజ్‌లోనే నింద్రించినట్లు మయే మస్క్ తెలిపారు.
ఆ ప్రదేశం వద్ద ఎలాంటి విలాసవంతమైన ఇండ్లు ఉండవని, అందువల్ల గ్యారేజ్‌లోనే నిద్రపోయానని ఆమె చెప్పగా అందరూ విడ్డురంగా చూసారు.
మయే మస్క్ అమెరికాలో ప్రముఖ మోడల్, ఉద్యమకర్త అన్న సంగతి విదితమే.మయేకు ముగ్గురు పిల్లలు.
ఎలన్, కింబల్, టోస్కా.ఆమె తన భర్త ఎర్రోల్ మస్క్ నుంచి విడాకులు తీసుకున్నారు.
"""/"/
ఇక ఈ ఘటన తన జీవితంలో అత్యంత కఠినమైందని ఆమె తాజాగా ఓ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు.
భర్త నుంచి విడిపోయిన తర్వాత పిల్లల్ని పోషించేందుకు చాలా కష్టపడినట్లు తెలిపారు.గతంలో ఎలన్ మస్క్… తనకు సొంత ఇల్లు కూడా లేదని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.
ఆమె అప్పుడు మాట్లాడుతూ."నాకు సొంత ఇల్లు కూడా లేదు.
డబ్బు కూడా నాకు అవసరం లేదు.నా స్థిరాస్తుల్ని అమ్మేస్తున్నాను.
ఆస్తులు మీకు భారాన్ని పెంచుతాయి!’’ అని పేర్కొన్నారు.
చంద్రబాబు హామీ : వంగవీటి రాధా దశ తిరగబోతోందా ?