బీజేపీ నుంచి బాబు కోరుకునేదదే ! ఓ కేంద్ర మంత్రి రాయబారం ?

ఏపీలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కునే పరిస్థితిలో లేదు ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉంది.

అప్పటిలోగా పార్టీ పూర్తిస్థాయిలో పుంజుకుని అధికారంలోకి వస్తామనే నమ్మకం టిడిపి అధినేత చంద్రబాబులో లేదు.

అలా వెళితే 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయేమో అన్న భయం ఉంది.

  అలా అని పూర్తిగా పొత్తుల పైనే ఆధారపడి ఎన్నికలకు వెళ్తే.తరువాత ఇబ్బందులు వస్తాయని టెన్షన్ పడుతున్నారు.

ఒకవైపు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుందాము అనుకున్నా, ముఖ్యమంత్రి పదవి విషయంలోనే సందిగ్ధం ఏర్పడింది.

  ఎన్నికల సమయం నాటికి ఆ వ్యవహారం చూద్దాం అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఇక కేంద్ర అధికార పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుని ఏపీలో ఎన్నికలకు వెళ్లాలని 2019 ఎన్నికల ఫలితాలు తర్వాత నుంచి చంద్రబాబు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

కానీ ఏపీ బీజేపీ నేతలతో పాటు కేంద్ర బిజెపి పెద్దలు టిడిపి తో పొత్తు వ్యవహారాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.

దీంతో బాబు సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.అయితే అవకాశం దొరికినప్పుడల్లా పొత్తు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

దీనిలో భాగంగానే ఓ కేంద్ర మంత్రి చొరవ తీసుకుని మరీ టిడిపి బిజెపిల మధ్య పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

అయితే చంద్రబాబు మాత్రం బిజెపి తమతో పొత్తు పెట్టుకోకపోయినా తమకు ఎటువంటి ఇబ్బందులు సృష్టించకుండా ఉంటే సరిపోతుందని భావిస్తున్నారు ఇదే విషయాన్ని సదర్ కేంద్ర మంత్రి వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కేంద్రానికి ఏపీ ప్రభుత్వం మద్దతు చాలా అవసరం.  """/"/ కేంద్రంలో ప్రవేశపెట్టే బిల్లలతో పాటు అనేక విషయాల్లో వైసీపీ ఎంపీల ఓట్లు కీలకం.

ఇక ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో వైసిపి కీలకంగా మారింది.151 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఇలా చాలామంది బిజెపి ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థి ఓటింగ్ లో పాల్గొనాల్సి ఉంది.

ఇక కేంద్రం కూడా వైసీపీ మద్దతు కోరడం, జగన్ ఇవ్వడం అన్నీ జరిగిపోయాయి.

బిజెపితో రాబోయే ఎన్నికల్లో పొత్తు సాధ్యం  అనే విషయం చంద్రబాబుకు తెలిసినా.రానున్న రోజుల్లో కేంద్రం నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తే సరిపోతుందని అంతకుమించి ఏమీ కోరుకోవడం లేదని సదరు కేంద్ర మంత్రి వద్ద చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.

అయితే ఏపీలో టీడీపీ పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళితే బీజేపీకి మేలు జరుగుతుందని సదర మంత్రి కేంద్ర బిజెపి పెద్దల వద్ద ప్రస్తావించగా,  ఎన్నికల సమయంలో ఆ సంగతి చుడోచ్చులే అంటూ చెప్పేశారట.

పుష్ప 2 విడుదలపై టీడీపీ ఎంపీ షాకింగ్ పోస్ట్.. వెంటనే డిలీట్.. మాకు సెంటిమెంట్ అంటూ!