అక్రమంగా భుమీ రిజిస్ట్రేషన్ చేసుకొని బేధరింపులకు పల్పడిన నలుగురి పై కేసు నమోదు, కడారి తిరుపతి అరెస్ట్.
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా: అక్రమంగా 60 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేపించుకొని చంపుతా అని బెదిరించిన నలుగురి పై కేసు నమోదు , కడారి తిరుపతి అనే వ్యక్తి అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలింపు, మిగతా ముగ్గురు పరారిలో ఉన్నట్లు వేములవాడ పట్టణ సి.
ఐ తెలిపారు.ఈ సందర్భంగా సి.
ఐ మాట్లాడుతూ.వేములవాడ సాయి నగర్ కు చెందినటువంటి మెండ శంకరవ్వ W/o దేవయ్య అనే మహిళ తనకు డబ్బులు అవసరం ఉండగా చెక్కపల్లి రోడ్లో తనకు ఉన్నటువంటి 60 గుంటల వ్యవసాయ భూములో ఒక గుంటను పోగుల శ్రీనివాస్ అనే వ్యక్తికి అమ్మగా , పోగుల శ్రీనివాస్ ఒక గుంట కాకుండా 60 గుంటలు భూమిని తన పేరున అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ముత్యాల రమేష్ అనే వ్యక్తికి అమ్మినాడు.
శంకరవ్వ కోర్టులో కేసు వేయగా అది తెలుసుకొని కడారి తిరుపతి అనే వ్యక్తి ఆమె వద్దకు వచ్చి చంపుతానని బెదిరించి తన చేత బలవంతంగా సంతకాలు తీసుకొని అతని తమ్ముడు అయిన కడారి మహేందర్ అను అతని పేరు మీద తన యొక్క 60 గుంటల భూమిని డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకొని అందులో ప్లాట్లు చేసి ఇతరులకు అమ్ముచుండగా భూమి ఎక్కడిది అని ఆమెను బెదిరించి మరలా ఇక్కడికి వస్తే చంపుతానని బెదిరించగా శంకరవ్వ వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం జరిగింది అన్నారు.
పోగుల శ్రీనివాస్, ముత్యాల రమేష్,కడారి తిరుపతి,కడారి మహేందర్ లపై కేసు నమోదు చేసి కడారి తిరుపతి అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందని,మిగితా ముగ్గురు పరారిలో ఉన్నారని వేములవాడ పట్టణ సి.
ఐ వీరప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఆహారాలు ఉడకబెట్టి తింటేనే ఎక్కువ ఆరోగ్యకరం.. తెలుసా?