ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదు
TeluguStop.com
నిజామాబాద్ జిల్లా( Nizamabad District ) ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై( Jeevan Reddy ) కేసు నమోదైంది.
తన భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తూ దామోదర్( Damodar ) అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో( Chevella Police Station ) మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కంప్లైంట్ ఇచ్చారు.
జీవన్ రెడ్డి తన అనుచరులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధిత వ్యక్తి ఆరోపిస్తున్నాడు.ఈ క్రమంలోనే కబ్జా చేసిన తన భూమి వద్ద పంజాబ్ కు చెందిన గ్యాంగ్ ను కాపలా ఉంచారన్న బాధితుడు వారితో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు జీవన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ధనుష్ తో వివాదం.. నేనెందుకు భయపడాలి.. నయన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!