బైక్ ను ఢీ కొట్టిన కారు-ఒకరు మృతి
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:నూతనకల్ మండలం పోలుమల్ల గ్రామ శివారులో జాతీయ రహదారి 365 పై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
వివరాల్లోకి వెళితే తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన వడ్లకొండ పూర్ణయ్య(38) నూతనకల్ మండల కేంద్రంలోని వైన్ షాప్ లో పనిచేస్తున్నాడు.
శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై తుంగతుర్తి వస్తుండగా పోలుమల్ల శివారులో అతివేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
అనంతరం కారు డ్రైవర్ పరారయ్యాడు.మృతునికి భార్య పద్మ,కుమార్తె కౌశిక,కుమారుడు లోకేష్ ఉన్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతుని భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మద్దిరాల ఎస్సై వెంకన్న తెలిపారు.
హిందీలోకి వెళ్తున్న సంక్రాంతికి వస్తున్నాం… హీరో అతనేనా?