పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:చిలుకూరు మండల పరిధిలోని జానకినగర్ స్టేజీ వద్ద కోదాడ-మిర్యాలగూడ రహదారిపై వెళుతున్న కారు అదుపుతప్పి పొలాలలోకి దూసుకెళ్లింది.
కారు కోదాడ మున్సిపల్ పరిధిలోని బాలాజీనగర్ కు చెందిన శ్రవణ్ కుమార్ కు చెందినదిగా గుర్తించారు.
ఈ ఘటనలో స్వల్ప గాయాలతో బయటపడ్డ శ్రవణ్ కుమార్ ను కోదాడలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు.
అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.