బైక్‌ను ఢీకొన్న కారు.. ఒకరు స్పాట్ డెడ్.. షాకింగ్ వీడియో వైరల్..!

ఈ రోజుల్లో రోడ్లపై ఎంత జాగ్రత్తగా వెళ్లినా ఇతరుల నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల చాలా మంది ప్రాణాలు పోతున్నాయి.

మద్యం తాగి నడపటం, రద్దీ ప్రాంతాల్లో కూడా వేగంగా దూసుకెళ్లడం వారి ప్రాణాలనే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా హరించేస్తున్నాయి.

తాజాగా జరిగిన ఒక షాకింగ్ యాక్సిడెంట్‌లో ఏ తప్పు చేయని ఒక బైకర్ చనిపోయాడు.

ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటనలో ఒక కారు అత్యంత వేగంగా వచ్చి ఒక బైకర్‌ను ఢీకొట్టింది.

ప్రమాదం జరిగిన సమయంలో ఆ బైకర్‌పై ఒక మగవ్యక్తి, ఒక మహిళ ఉన్నారు.

వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు.ఇప్పుడు వారు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.

వివరాల్లోకి వెళితే.పంజాబ్ రాష్ట్రం, అమృత్‌సర్‌ సిటీ, ఛెహర్తా ప్రాంతంలోని ఆజాద్ రోడ్డులో అక్టోబర్ 16న సరిగ్గా ఉదయం ఏడున్నరకు యాక్సిడెంట్ జరిగింది.

ఈ ప్రమాదం సమీపంలోని ఒక సీసీ కెమెరాలో రికార్డయింది.ఆ వీడియో క్లిప్‌ను ఒక ట్విట్టర్ యూజర్ షేర్ చేయగా అది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది.

వైరల్ వీడియోలో బైక్‌పై ఇద్దరు వెళ్తుండటం చూడవచ్చు.ఇంతలోనే అటువైపుగా వచ్చిన ఒక కారు వారి మోటారుసైకిల్‌ను బలంగా ఢీకొట్టింది.

ఆ ఫోర్స్‌కి బైక్‌పై ఉన్న వారిద్దరూ కూడా చాలా ఎత్తుకు ఎగిరి కింద పడ్డారు.

వీరిద్దరిలో ఎవరికి కూడా హెల్మెట్ లేదు.వారికి ఎలాంటి ప్రొటెక్ట్ గేర్ కూడా లేదు.

పైగా ఆ కారు చాలా బలంగా డాష్ ఇవ్వడంతో వారిలో మగ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.

అతనితో వచ్చిన మహిళ తీవ్రంగా గాయపడింది.యాక్సిడెంట్ అయినప్పుడు పెద్ద సౌండ్ రావడంతో అక్కడే ఉన్న ఒక ఇంట్లో నుంచి పెద్దావిడ బయటకు వచ్చింది.

వారికి సహాయం చేద్దామని స్థానికులతో చెప్పినా వారెవరూ కూడా కాపాడేందుకు ముందుకు రాలేదు.

ఈ వీడియో చూసి చాలామంది కారు డ్రైవర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండి నడిపాడేమోనని కొందరు అంటున్నారు.ఏదేమైనా అతివేగానికి మరొకరు బలైపోయారు.