3 కళ్లతో పుట్టిన లేగదూడ... డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?

ఈ చరాచర సృష్టిలో ఎప్పుడూ ఏదో ఒక వింత చోటుచేసుకునే ఉంటుంది.సాధారణ జనం వాటిని అద్భుతం.

దైవం అనే పేరుతో పిలుస్తారు.కొంతమంది చదువరులు అది సైన్స్ అని, జీవరాశి మనుగడలో ఏర్పడిన వ్యత్యాసాలని చెబుతూ వుంటారు.

తాజాగా అలాంటి ఓ సంఘటన స్థానికంగా చర్చనీయాసమైంది.అవును, శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పిన విషయం అక్కడ చోటు చేసుకుంది.

చత్తీస్ ఘడ్ లోని రాజ్నంద్గావున్ జిల్లాలో ఒక వింత ఆవు దూడ జన్మించింది.

సాధారణంగా ఆవు దూడకు 2 కళ్ళు మాత్రమే ఉంటాయి కదా.కానీ ఇక్కడ ఇటీవల జన్మించిన ఆవు దూడకి మాత్రం మూడు కళ్ళు వున్నాయి.

ఏంటి ఆశ్చర్యంగా వుందా? మీరు విన్నది నిజమే.ఏకంగా మహా శివుడి మూడవ కన్నులాగే ఆ దూడకి మూడు కళ్లు ఉన్నాయి.

2 కళ్లు సాధారణంగానే ఉంటే ఇక మూడవ కన్ను నుదిటిన మధ్యలో ఉంది.

అంతే కాకుండా ముక్కు రెండు రంధ్రాలు కాకుండా ఏకంగా 4 రంధ్రాలను కలిగి వుంది.

దాంతో ఈ విషయం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది.ఈ విషయం ఆనోటా ఈనోటా విన్నవారు ఇరుగు పురుగు వారికి చెప్పడంతో లోకల్ మీడియా వారికి కూడా ఆ ఫుటేజ్ చిక్కింది.

"""/"/ దాంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక నూతన సంవత్సరం సందర్భంగా ఆ లేగదూడ పుట్టడం వలన సదరు దూడ యజమానులు అదృష్టంగా భావిస్తున్నారు.

సాక్షాత్ మహాశివుని ప్రసాదం అని దానికి పూజలు కూడా చేస్తున్నారట! అయితే పిండం సరిగా అభివృద్ధి చెందకపోవడం వలన జన్యులోపం కారణంగా ఇలా వింత రూపంలో జన్మించి ఉంటుందని అక్కడి వైద్యులు చెబుతున్నారు.

ఇంకా ఈ వ్యవహారం చుట్టు పక్కల ప్రాంతాలకి పాకడంతో లేగదూడను చూసేందుకు జనాలు భారీగా తరలి వెళ్తున్నారట.

వైరల్: బ్యాంకు క్యాషియర్ మెడపై కత్తి పెట్టి, డబ్బులు ఇవ్వాలని బెదిరించిన దొంగ!