డజన్ మామిడి పండ్లను ఏకంగా 1.2 లక్షలకు కొన్న వ్యాపారవేత్త.. ఎందుకంటే..?!

కరోనా మహమ్మారి వలన ప్రజలు అందరు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

చాలా కుటుంబాలు ఆర్ధికంగా నష్ట పోయి రోడ్డున పడ్డాయి.ఉపాధి లేక చాలా మంది తమ సొంత ఊర్లకి వలస వెళ్లిపోయారు.

అలాగే విద్యార్థులు కూడా వాళ్ళ చదువులకు దూరం అయ్యి ఎదో ఒక పని చేస్తూ తల్లి తండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు.

ఈ క్రమంలోనే చదువుకునే ఒక చిన్నారి కూడా తల్లి తండ్రుల ఆర్ధిక పరిస్థితి బాగోలేకపోవడంతో చదువు మానేసి తల్లి తండ్రులకు ఆసరాగా ఉంటూ రోడ్డు మీద మామిడి పండ్లు అమ్ముతుంది.

కరోనా వైరస్ వలన పాఠశాలలు మూసివేయడంతో ఆన్లైన్ లో తరగతులు నిర్వహిస్తున్నారు.కానీ ఈ పేద చిన్నారికి స్మార్ట్ ఫోన్ కొనుక్కునే స్థోమత లేక చదువు మానేసి మామిడి కాయలు అమ్ముతుంది.

అయితే దేవుడే మనిషి రూపంలో వచ్చాడనుకుంటా.ఆ చిన్నారి అమ్మే మామిడి పండ్లు అన్నీ కొనేసాడు.

వందకో రెండొందలకో కాదండోయ్.ఏకంగా లక్షా ఇరవై వేలకు కొన్నాడు.

ఏంటి షాక్ అయ్యారా.? కానీ ఇది నిజమే.

అసలు వివరాల్లోకి వెళితే.జంషెడ్పూర్‌ కు చెందిన తులసి కుమారి అనే పదకొండు సంవత్సరాల బాలిక చదువు మానేసి రోడ్డుపై మామిడి పండ్లు అమ్ముకుంటూ జీవిస్తోంది.

అయితే మామిడి పండ్లు అమ్మే ఆ చిన్నారిని ముంబైకి చెందిన అమెయా హేతే అనే వ్యాపారవేత్త గమనించాడు.

ముంబైలో ఉన్న ఎడ్యుటైనర్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఉన్న ఆయన పండ్లు అమ్ముతున్న బాలికతో మాట్లాడుతున్న సమయంలో ఆ బాలికకు చదువు పట్ల ఉన్న ఆసక్తిని, ఇష్టాన్ని గమనించి ఆ బాలికకు సహాయం చెయ్యాలని అనుకున్నారు.

"""/"/ అనుకున్నదే తడువుగా తులసి కుమారి తండ్రి నరేంద్ర హేతే దగ్గర ఉన్న 12 మామిడికాయలను అక్షరాలా లక్షా 20వేల రూపాయలు పెట్టి కొన్నాడు.

కేవలం 120రూపాయలు ఖరీదు చేసే మామిడి పండ్లను లక్షా ఇరవై వేల పెట్టి కొన్నాడు.

అంటే ఒక్కో మామిడి పండు ధర 10 వేలు అన్నమాట.అమెయా హేతే ఇచ్చిన డబ్బులతో తులసికి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ కొనివ్వమని, అలాగే రెండేళ్ల పాటు ఇంటర్నెట్ కూడా ఉచితంగా అందించాలని తండ్రికి సూచించారు.

"""/"/ ఇలా చేయడం వలన తులసి ఆన్‌లైన్ క్లాస్‌ లు మిస్ అవ్వకుండా బాగా చదువుంతుందని, అవసరమైనప్పుడు ఇంకా తనకు మామిడి పండ్లు అమ్మాలంటూ వెళ్లిపోయాడు.

ఇంత గొప్ప మనసు ఉన్న అమెయా కు తులసి తల్లి పద్మిని, తండ్రి నరేంద్ర హేతే కృతజ్ఞతలు తెలిపారు.

భగవంతుడే అమేయా హేతే రూపంలో వచ్చి తమ కష్టాలను తగ్గించాడంటూ సంతోషం వ్యక్తం చేశారు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?