దారుణం.. తన చెల్లికి రైలులో ఎదురైనా అనుభవానికి ఓ అన్న ఆవేదన. .. పోస్ట్ వైరల్..!

ఈ మధ్యకాలంలో భారతీయ రైల్వేకు( Indian Railways ) సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ముఖ్యంగా రైల్లో రద్దీ కారణంగా అనేక వీడియోలు ట్రెండింగ్ లోకి వస్తున్నాయి.రైళ్లలో రిజర్వేషన్ కోచ్లలో కూడా టికెట్ లేనివారు ప్రయాణం చేస్తున్న కారణంగా ఎదుర్కొన్న సమస్యలకు సంబంధించి ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజాగా ఓ మహిళకు రైలులో ఎదురైన అనుభవం సంబంధించి ఆమె అన్న చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారంది.

అతడు తన బాధను చెబుతూ రైల్వేలో పరిస్థితులను చక్కదిద్దలంటూ ఏకంగా రైల్వే మంత్రిని సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించారు.

రచిత్ జైన్( Rachit Jain ) అనే ఓ వ్యక్తి నెట్ లో పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం బాగా వైరల్ గా మారింది.

"""/" / ఇక ఈ పోస్టులో తన చెల్లెలు బిడ్డతోపాటు రైలు ఎక్కడానికి వెళ్ళగా అక్కడ దారుణ అనుభవం ఎదురయిందని చెప్పుకొచ్చాడు.

తన చెల్లెలు ఏసి 3 టైర్ టికెట్టు కొనుక్కుందని.తీరా రైల్వే కోచ్ దగ్గరికి వెల్లి సరికి తలుపుల వద్ద చాలామంది బారులు తీరి లోపలికి వెళ్లడానికి అడ్డంగా నిలబడ్డారంటూ చెప్పుకొచ్చాడు.

ఈ కారణం చేత తన చెల్లికి ఊహించిన విపత్తు ఎదురైందని ఆయన వాపోయాడు.

తన చెల్లెలు రైల్లోకి ఎక్కిన తన బిడ్డ మాత్రం ప్లాట్ఫామ్ పైనే ఉండిపోవడంతో దాంతో తన బిడ్డ కోసం తన చెల్లెలు కంగారులో కదులుతున్న రైలులో నుంచి కిందికి దూకేసిందని చెప్పుకొచ్చాడు.

ఈ నేపథ్యంలో తన చెల్లికి స్వల్ప గాయాలు కూడా వాపోయాడు. """/" / ఇక ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ పోస్టులో తన చెల్లెలి టికెట్ నెంబర్ అలాగే ట్రైన్ పిఎన్ఆర్ నెంబర్ ( Train PNR No )ను కూడా జతపరిచాడు.

ఇకపోతే కొన్ని రైళ్లలో ఇలాంటి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వాటిని చక్కదిల్లాలంటూ ఏకంగా రైల్వే శాఖకు, అలాగే కేంద్రమంత్రి అశ్విన్ వైష్ణవకు సోషల్ మీడియా వేదికగా అతను విజ్ఞప్తి చేశాడు.

ముఖ్యంగా టికెట్ లేని వారు అలాగే వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులు రిజర్వేషన్ కోచ్ లలో ప్రయాణం చేయడం ద్వారా టికెట్లు ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారని రచిత్ తెలియజేశాడు.

ఈ పోస్ట్ వైరల్ కావడంతో అతడికి భారీ స్పందన వచ్చింది.

నాని సినిమాకు మెాహన్ బాబు ప్లస్ అవుతాడా? మైనస్ అవుతాడా..?