ఈదురు గాలులకు రోడ్డుపై విరిగిపడ్డ తాటి చెట్టు

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలంలో సోమవారం వీచిన ఈదురు గాలులకు వావిలపల్లి-చిల్లపురం గ్రామాల మధ్య నడిరోడ్డు తాటి చెట్టు విరిగిపడింది.

దీనితో కాసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది.అయితే ఆ సమయంలో వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది.

మండలంలో అక్కడక్కడ గాలి దుమారాలతో కూడిన వర్షం పడింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు19, సోమవారం 2024