ఆలేరు-పటేల్ గూడెం మార్గంలో వాగుపై వంతెన నిర్మించాలి

యాదాద్రి భువనగిరి జిల్లా: ఇటీవల కురిసిన వర్షాలతో ఆలేరు-పటేల్ గూడెం(Aleru-Patel Goodem ) గ్రామానికి వెళ్లే మార్గంలో వాగుపై వున్న వంతెన కొట్టుకపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిపోయాయని పటేల్ గూడెం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ధ్వంసమైన వంతెన వద్ద నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మార్గంలో శాశ్వత ప్రాతిపదికన వంతెన నిర్మాణాన్ని చేపట్టాలని పలుమార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు వినతులు, విజ్ఞప్తులు అందజేసినా ఫలితం లేదని ఆరోపించారు.

గ్రామానికి చెందిన రైతులు సొంత ఖర్చులతో వాగులో పైపులు వేసుకొని తాత్కాలికంగా వాగును దాటుకొని తమ వ్యవసాయ భూములకు( Agricultural Lands ) వెళ్లేందుకు మట్టి రోడ్డు నిర్మాణం చేసుకున్నామని, 300 కుటుంబాలు బావుల దగ్గరికి వెళ్లేందుకు ప్రధాన మార్గం కావడంతో దీనిపై తాము అందరం ఆధారపడి ఉన్నామని, ఇటీవల కురిసిన వర్షాలతో పైపులు కొట్టుకపోయి రోడ్డు ధ్వంసం అయిందని వాపోయారు.

ఆలేరు మండలం కొలనుపాక గ్రామం నుండి పటేల్ గూడెం గ్రామానికి వెళ్లే మార్గంలో ముత్యాలమ్మ గుడి సమీపంలో ఉన్న ఈ వాగుపై శాశ్వత ప్రాతిపదికన వంతెన నిర్మాణాన్ని చేపట్టి తమకు న్యాయం చేయాలని,ఈ విషయంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెంటనే స్పందించి వంతెన నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా తెలియజేస్తుమన్నారు.

ఈ కార్యక్రమంలో రైతులు రఘుపతిరెడ్డి,రాములు, సోమిరెడ్డి,ఐలయ్య,రమేష్,భుజంగరావు,రాజిరెడ్డి తదితరులు ఉన్నారు.

మగబిడ్డకు జన్మనివ్వడంపై ప్రణీత రియాక్షన్ ఇదే.. మళ్లీ అలా చేయబోతున్నానంటూ?